AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలపాటు సినీరంగంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రాజమండ్రిలో ఆ హీరో డ్యాన్స్ ప్రాక్టీస్, షూటింగ్‌కు ముందు మద్యపానంపై ఆయన మందలింపు గుర్తు చేసుకున్నారు. తనతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు.

Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
Kota Srinivasarao
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2026 | 4:43 PM

Share

తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి కృషి, వారిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. చిరంజీవి అంకితభావం తనను తొలిసారిగా ఎలా ఆశ్చర్యపరిచిందో కోట వివరించారు. మొదటిసారి చిరంజీవిని చూసిన అనుభవం ఆయన మాటల్లోనే ఆసక్తికరంగా ఉంటుంది. రాజమండ్రిలోని అప్సరా హోటల్ దగ్గర, ఒక సాయంకాలం పూట ఒక వరండాలో చిరంజీవి మెడలో హార్టిన్ మార్క్ చైను, చిన్న టాప్ ధరించి, టేప్ రికార్డర్‌లో సంగీతం పెట్టుకుని పిచ్చిగా డాన్స్ సాధన చేస్తూ కనిపించారట. “ఏంట్రా బాబు ఇది” అని అప్పుడు ఆశ్చర్యపోయానని, ఒక ఆర్టిస్ట్ సినిమాలో ఎంత శ్రమపడాలి అనేది అప్పుడే తనకు అర్థమైందని కోట గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన చిరంజీవి అంకితభావానికి నిదర్శనమని కోట శ్రీనివాస రావు అన్నారు. ఒకసారి షూటింగ్ సమయంలో కోట శ్రీనివాసరావు మందు తాగి ఉన్నందుకు చిరంజీవి బహిరంగంగా మందలించిన సందర్భాన్ని కూడా కోట గుర్తు చేసుకున్నారు. “అయ్యా బుద్ధిలేదయ్యా నీకు, ఇంత కెరీర్ ఉన్న వాడివి నువ్వు పాలు కూడా తాగరు అటువంటిది, ఇటువంటిది” అంటూ చిరంజీవి కోప్పడ్డారని గుర్తు చేసుకున్నారు. అది తన అభివృద్ధిని ఆశించి చెప్పిన మాటే తప్ప, వ్యక్తిగతంగా కాదని కోట స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

చిరంజీవి తనపై చూపించిన ఈ శ్రద్ధ, తన కెరీర్ పట్ల ఆయనకున్న ఆందోళనకు నిదర్శనమని కోట అన్నారు. కోట శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానాన్ని “ప్రాణం ఖరీదు” సినిమాతో ప్రారంభించారు. ఈ సినిమాలో చిరంజీవి కూడా నటించారని, అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి “ఖైదీ నెం. 786” సినిమాలో తనను విలన్‌గా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారని కోట వెల్లడించారు. ఈ సినిమాతో చిరంజీవికి విలన్‌గా నటించే అవకాశం లభించిందని, ఆ తర్వాత అనేక సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి మహానటులు ఉన్న కాలంలో కూడా చిరంజీవి తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని (బాణీ) సృష్టించుకుని అగ్రస్థానానికి ఎదిగారని కోట గుర్తుచేశారు. అందుకే చిరంజీవిని అనుకరించడం ఎవరివల్లా కాదన్నారు. ప్రస్తుత తరం నటుల గురించి మాట్లాడుతూ, తనకు తెలిసినంత వరకు మార్కెట్ పరంగా, ప్రజల్లో గుర్తింపు పరంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ (బన్నీ), మహేష్ బాబు ఉన్నత స్థానంలో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి స్థాయిని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

కోట శ్రీనివాస రావు, చిరంజీవి ఫోటో..

Kota Srinivasarao, Chiranje

Kota Srinivasarao, Chiranje

ఎక్కువ మంది చదివినవి : Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

Follow Us