ఆమెకు 19.. అతడికి 32.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే అందమైన జంట.. 

Rajitha Chanti

Pic credit - Instagram

04 October 2026

దక్షిణాది చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన క్యూట్ కపుల్స్‌లో నటి నజ్రియా నజీమ్, వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాసిల్ ఒకరు.

'అంటే సుందరానికి' చిత్రంతో నజ్రియా, 'పుష్ప'తో ఫహాద్ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. వీరి లవ్ స్టోరీ ఒక సినిమా రీల్‌ను తలపిస్తుంది.

వీరిద్దరి ప్రేమ ప్రయాణానికి పునాది పడింది 2014లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మలయాళ చిత్రం 'బెంగళూర్ డేస్' షూటింగ్ సమయంలో. 

ఈ సినిమాలో నజ్రియా, ఫహాద్ భార్యాభర్తలుగా నటించారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండించే క్రమంలోనే ఆఫ్ స్క్రీన్‌లోనూ ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది.

షూటింగ్ బ్రేక్‌లో సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో నజ్రియాయే స్వయంగా ఫహాద్ వద్దకు వచ్చి సూటిగా ప్రేమను వ్యక్తం చేసింది. 

తన జీవితాంతం తోడుగా ఉంటానంటూ ఎలాంటి ముసుగు లేకుండా అడిగిన ఆ ప్రతిపాదనకు ఫహాద్ ఫిదా అయిపోయారు.

ఆ తర్వాత ఫహాద్ ఫాసిల్ ఒక చేతిరాత లేఖతోపాటు ఉంగరాన్ని అందిస్తూ నజ్రియాకు అధికారికంగా ప్రపోజ్ చేశారు. 

కేవలం 19 ఏళ్ల వయసులోనే 11 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న ఫహాద్‌ను పెళ్లి చేసుకుంది. ఆగస్టు 2014లో వీరి పెళ్లి జరిగింది.