AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: మీ కిడ్నీలు భద్రంగా ఉండాలా.? ఈ ఫుడ్‌ తీసుకుంటే చాలు..

వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని పనులు తీసుకునే ఆహారంతో కిడ్నీలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషించే.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు...

Kidney Health: మీ కిడ్నీలు భద్రంగా ఉండాలా.? ఈ ఫుడ్‌ తీసుకుంటే చాలు..
Kidney Health
Narender Vaitla
|

Updated on: Nov 26, 2023 | 2:11 PM

Share

మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో కిడ్నీలది కీలక పాత్ర అనే విషయం తెలిసిందే. మనం తీసుకునే పానీయాలను కిడ్నీలు ఫిల్టర్‌ చేస్తాయి. వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని పనులు తీసుకునే ఆహారంతో కిడ్నీలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషించే.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కిడ్నీల పనితీరును మెరుగు పరిచే అలాంటి ఆహార పదార్థాలపై ఓ లుక్కేయండి..

* కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్‌ సీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. నిమ్మ, నారింజ పండ్లను ఆహారంలో భౄతం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఫుడ్‌తో శరీరం తేమవంతంగా ఉంటుంది. మూత్రపిండాల్లోని వ్యర్థాలను బయటికి పంపేందుకు ఇది సహాయపడుతుంది. వీటిలోని సిట్రేట్‌ మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉపయోగపడుతుంది.

* దోసకాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. దోసకాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవు. దోసకాయలు తినడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.

* మూత్ర పిండాల ఆరోగ్యంలో సాల్మన్, ట్యూనా వంటి చేపలు కీలక పాత్ర పోషిస్తాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్‌ అధ్యయనం ప్రకారం ఒమేగా 3 కొవ్వులు అధికంగా ఉండే ఫుడ్‌ను తీసుకుంటే.. రక్తంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

* కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడ నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నిత్యం హైడ్రేట్‌గా ఉంటే.. శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాలు బయటికి పోతాయి. సహజంగా మూత్రపిండాలను రిపేర్ చేయడంలో నీరు ఉపయోగపడుతుంది.

* యూరినటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌ను దూరం చేయడంలో క్రాన్ బెర్రీస్‌ కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా క్రాన్ బెర్రీలను తీసుకోవడం వల్ల మూత్రాశం, మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..