చాలామంది బ్యాంకు లాకర్లను అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు. అయితే, బ్యాంకు లాకర్లలోని వస్తువులకు ఆటోమేటిక్గా బీమా ఉండదని చాలామందికి తెలియదు. బ్యాంకులు కేవలం లాకర్ స్థలాన్ని మాత్రమే అద్దెకు ఇస్తాయి. దొంగతనం లేదా అగ్నిప్రమాదం వంటి బ్యాంకు నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితేనే పరిహారం చెల్లిస్తాయి, అది కూడా వార్షిక అద్దెకు గరిష్టంగా 100 రెట్లు మాత్రమే.