- Telugu News Photo Gallery Health Tips: women should eat 5 dates on an empty stomach every day, Know why
Health Tips: రోజు పరగడుపున 5 ఖర్జూరాలు తింటే.. ఆ వ్యాధులకు చెక్ పెట్టినట్లే!
ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. దీనితో పాటు శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. గుండె దృఢంగా ఉండాలంటే ప్రతిరోజూ ఖర్జూరం తినడం చాలా అవసరం. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చలికాలంలో ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పులతో బాధపడే మహిళలు తప్పనిసరిగా ప్రతిరోజూ ఖర్జూరం తినాలి. ఎండిన ఖర్జూరంలో
Updated on: Nov 26, 2023 | 12:37 PM

ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. దీనితో పాటు శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. గుండె దృఢంగా ఉండాలంటే ప్రతిరోజూ ఖర్జూరం తినడం చాలా అవసరం. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చలికాలంలో ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పులతో బాధపడే మహిళలు తప్పనిసరిగా ప్రతిరోజూ ఖర్జూరం తినాలి. ఎండిన ఖర్జూరంలో పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల కలిగే ఇతర లాభాలు ఇవే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఖర్జూరం తినడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే.. ముందుగా వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టడం. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయం ఖాళీ కడుపుతో సులభంగా తినవచ్చు.

ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్, పీచు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ కె, సోడియం అధికంగా లభిస్తాయి. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6 కూడా ఉంటుంది.

ఖర్జూరం తినడం శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించవచ్చు. దీన్ని తినడం వల్ల ఎముకలు కూడా బలపడతాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల కంటి, కడుపు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, అల్జీమర్స్, పలు రకాల క్యాన్సర్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఖర్జూరం తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇందులో ఉండే విటమిన్ కె రక్తం చిక్కబడకుండా చేస్తుంది.




