అలసటను తరిమి కొట్టే సమ్మర్ స్పెషల్ డ్రింక్..ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి!

Samatha

15 march 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు, చాలా మంది నిమ్మకాయ షర్భత్ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

సమ్మర్ డ్రింక్

బయటకు వెళ్లి వచ్చినప్పుడు కానీ, వడదెబ్బ తగిలినప్పుడు నిమ్మకాయ షర్బత్ తాగడం వలన అలసట, నీరసం దూరం అవుతుంది.

అలసట, నీరసం

అయితే ఈ నిమ్మకాయ షర్భత్ ఎలా తయారు చేసి తాగడం వలన , ఆరోగ్యానికి మేలు చేస్తుంది? దీనిని ఇంటిలో ఎలా తయారు చేయాలో చూద్దాం.

నిమ్మకాయ షర్భత్

కావాల్సిన పదార్థాలు : ఒక నిమ్మకాయ, రెండు చెంచాల చక్కెర, చిటికెడు ఉప్పు, ఐస్ క్యూబ్స్.

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం : ముందుగా గ్లాస్ తీసుకొని అందులో నిమ్మ రసం పిండుకోవాలి. తర్వాత అందులో చల్లటి నీరు పోసుకోవాలి.

నిమ్మరసం

 ఇప్పుడు అందులో చక్కెర, చిటికెడు ఉప్పు వేసి మంచి కలుపుకోవాలి. చక్కెర మిశ్రమం కరిగే వరకు చెంచాతో కలుపుకోవాలి.

చక్కెర, ఉప్పు

తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ వేసి, వీలైతే పూదీనా ఆకులు పైన గార్నిష్‌గా కూడా వేసుకోవచ్చు. అంతే వేసవి తాపాన్ని తగ్గించే నిమ్మకాయ షర్భత్ రెడీ.

ఐస్ క్యూబ్స్

సమ్మర్‌లో ప్రతి రోజూ ఒక గ్లాస్ నిమ్మకాయ షర్బత్ తాగడం వలన ఇది ఒంటిలో వేడిని తగ్గించడమే కాకుండా, అలసట, నీరసం తగ్గించి శరీరానికి చాలా మేలు చేస్తుంది.

నీరసం, అలసట