AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ ఒక్క నిర్ణయంతో భారీగా తగ్గనున్న ధరలు..!

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరల మధ్య పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు, ఆభరణాల వ్యాపారులకు ఊరటనిస్తూ.. బంగారం బేస్ దిగుమతి ధరను తగ్గిస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Gold Price: బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ ఒక్క నిర్ణయంతో భారీగా తగ్గనున్న ధరలు..!
Central Government Slashes Gold Base Import Price
Krishna S
|

Updated on: Mar 15, 2026 | 4:54 PM

Share

గత కొంతకాలంగా బంగారం ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం బంగారం బేస్ దిగుమతి ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ సెగతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ప్రభుత్వం 10 గ్రాముల బంగారంపై బేస్ దిగుమతి ధరను 12 డాలర్ల మేర తగ్గించింది. గతంలో 1664 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు అది 1652 డాలర్లకు చేరింది.

బేస్ దిగుమతి ధర అంటే ఏమిటి? దీని వల్ల లాభమేంటి?

సాధారణంగా దేశంలోకి దిగుమతి అయ్యే బంగారంపై కస్టమ్స్ సుంకం మరియు ఇతర దిగుమతి పన్నులను లెక్కించడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట ధరకు ప్రామాణికంగా తీసుకుంటుంది. దీనే టారిఫ్ విలువ లేదా బేస్ దిగుమతి ధర అంటారు. ఇప్పుడు ఈ బేస్ ధర తగ్గడం వల్ల దిగుమతిదారులపై భారం తగ్గి.. దేశీయ మార్కెట్లోకి బంగారం తక్కువ ధరకు చేరుతుంది. అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గుల వల్ల పెరిగిన ఖర్చులను ఎదుర్కొంటున్న జువెలర్స్ మరియు బులియన్ వ్యాపారులకు ఈ నిర్ణయం పెద్ద మద్దతుగా నిలుస్తుంది. దిగుమతి ఖర్చులు తగ్గడంతో, ఆభరణాల వ్యాపారులు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసే అవకాశం ఉంది. తద్వారా దేశీయంగా బంగారం ధరలు కొంతమేర తగ్గే ఛాన్స్ ఉంది.

ఎందుకు ఈ నిర్ణయం?

అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా దేశీయ మార్కెట్ ధరలను సమతుల్యం చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఈ సవరణలు చేసింది. మన దేశీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడేలా ఉండటం మరియు వినియోగదారులపై ధరల ఒత్తిడిని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఈ ప్రభావం దేశీయ రిటైల్ మార్కెట్‌పై ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Follow Us
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే
అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే
అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే
ఏపీ EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? చివరి ఛాన్స్..
ఏపీ EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? చివరి ఛాన్స్..