ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత వేడి వేడి టీ ఓ కప్పు తాగితే ఆ మజానే వేరు. కప్పు టీతో రోజంతా అలసట, ఒత్తిడి చిటికెలో మాయం అవుతుంది. టీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీ ద్వారా బరువు కూడా తగ్గొచ్చు. టీలో కెఫిన్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ రెండు పదార్థాలు రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను నియంత్రించి, జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి. దీంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.