AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: ఎస్బీఐలో రూ.75లక్షల హోమ్ లోన్‌ రావాలంటే ఎంత జీతం ఉండాలో తెలుసా..?

మధ్యతరగతి ప్రజల అతిపెద్ద కల.. ఒక సొంత ఇల్లు. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో హోమ్ లోన్ ఒక వరంగా మారుతుంది. అయితే గతంలో ఆకాశాన్ని తాకిన వడ్డీ రేట్ల.. ఇప్పుడు కొద్దిగా తగ్గాయి. ఈ క్రమంలో రూ.75 లక్షల లోన్ తీసుకోవాలంటే మీ నెలవారీ ఆదాయం ఎంత ఉండాలి? ఏ బ్యాంక్ తక్కువ వడ్డీని వసూలు చేస్తోంది? అనేది తెలుసుకుందాం..

Home Loan: ఎస్బీఐలో రూ.75లక్షల హోమ్ లోన్‌ రావాలంటే ఎంత జీతం ఉండాలో తెలుసా..?
Sbi Home Loan Eligibility For Rs 75 Lakh
Krishna S
|

Updated on: Mar 15, 2026 | 6:30 PM

Share

ప్రస్తుతం సొంత ఇల్లు కట్టుకోవడం అనేది మధ్యతరగతి ప్రజలకు ఒక పెద్ద సవాలు. ఈ కలను సాకారం చేసుకోవడానికి మెజారిటీ ప్రజలు హోమ్ లోన్స్‌నే నమ్ముకుంటారు. గత ఏడాది రెపో రేటులో దాదాపు 1.25 శాతం తగ్గడంతో ప్రస్తుతం హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గి, రుణగ్రహీతలకు కొంత ఊరట లభిస్తోంది. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బ్యాంకులు 7.10 శాతం నుంచే గృహ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం సుమారు 7.25 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తోంది. ఉదాహరణకు.. మీరు SBI నుండి 30 ఏళ్ల కాలపరిమితితో రూ.75 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే, మీ నెలవారీ ఈఎంఐ సుమారు రూ.51,000 వరకు ఉంటుంది. అయితే కేవలం ఈఎంఐ కట్టడమే కాకుండా మీ కుటుంబ అవసరాలకు కూడా డబ్బు మిగలాలి కాబట్టి బ్యాంకులు మీ ఆదాయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.

ఎంత జీతం ఉండాలి..?

సాధారణంగా బ్యాంకులు లోన్ తీసుకునే వారి నికర ఆదాయంలో 40 నుండి 50 శాతం మాత్రమే ఈఎంఐకి కేటాయించేలా చూస్తాయి. దీని ప్రకారం.. మీరు రూ.50,000 ఈఎంఐ చెల్లించాలంటే మీ నెలవారీ జీతం కనీసం రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మీకు ఇదివరకే కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ వంటి ఇతర రుణాలు ఉంటే, మీకు వచ్చే హోమ్ లోన్ మొత్తం ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది.

వడ్డీ రేట్లు ఇలా..?

ప్రస్తుతం వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత తక్కువగా 7.10 శాతానికే రుణాలు ఇస్తోంది. కెనరా బ్యాంక్ 7.15 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.20 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సుమారు 7.30 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఈ రేట్లు మీ క్రెడిట్ స్కోరును బట్టి కొద్దిగా మారే అవకాశం ఉంటుంది.

సిబిల్ ముఖ్యం

హోమ్ లోన్ విషయంలో మీ క్రెడిట్ స్కోరు ఒక వజ్రాయుధం లాంటిది. మీ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే బ్యాంకులతో చర్చించి వడ్డీ రేటులో మరిన్ని రాయితీలు పొందే అవకాశం ఉంటుంది. అదే స్కోరు తక్కువగా ఉంటే రుణ ఆమోదంలో జాప్యం జరగడమే కాకుండా బ్యాంకులు ఎక్కువ వడ్డీని వసూలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి రుణం తీసుకునే ముందే వడ్డీ రేట్లు, మీ ఆదాయం మరియు ఇతర ఖర్చులను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.

Follow Us