ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. నెటిజన్స్ తీరుపై హరీష్ శంకర్ అసహనం
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ అంటూ వస్తున్న ట్రోల్స్‌పై దర్శకుడు హరీష్ శంకర్ తీవ్రంగా స్పందించారు. ఈ సినిమా విజయ్ 'తేరి'కి రీమేక్ కాదని, ఇది పూర్తిగా ఒరిజినల్ కథ అని మరోసారి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో వినోదంతో పాటు సామాజిక అంశాలుంటాయని వివరించారు. థియేటర్లలో చూశాక నిజం తెలుస్తుందని అన్నారు.
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన హరీష్ శంకర్…తన రీసెంట్ ఇంటర్వ్యూలో.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విజయ్ నటించిన ‘తేరి’ చిత్రానికి రీమేక్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్ చేస్తున్నారు. కేవలం ట్రోల్ చేయడానికే సుమారు మూడు లక్షల అరవై వేల ట్వీట్లు వేశారు. ఇది గమనించిన హరీష్ శంకర్.. సీరియస్ అయ్యాడు. సినిమా గురించి వాస్తవాలు చెప్పినా ఎవరూ నమ్మడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏ సినిమాకు రీమేక్ కాదు. ఇది పూర్తిగా ఒరిజినల్ కథ అంటూ మరో సారి గట్టిగా చెప్పాడు. నేను చెబుతున్నా కూడా నమ్మకపోతే ఎలా? ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి చెప్పాలా? అంటూ ఒకింత అసహనానికి లోనయ్యాడు హరీష్ శంకర్. రేపు సినిమా విడుదలయ్యాక థియేటర్లలో చూసినప్పుడు అది రీమేక్ కాదని అందరికీ అర్థమవుతుంది. అప్పటి వరకు వేచి ఉండండి అన్నారు హీరీష్. ప్రస్తుతం ఈయన మాటలు కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి,. అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. ఇంకా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథను సిద్ధం చేశానని, ఇందులో కేవలం వినోదమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉంటాయని వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
మోనాలిసా లవ్ మ్యారేజ్ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్
సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్
Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..
ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు 'గ్యాస్ ఫీజు' కట్టాల్సిందే..
అమ్మ దొంగ చేపా... ఎంత పనిచేశావే !
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

