AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్

మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్

Phani CH
|

Updated on: Mar 15, 2026 | 6:32 PM

Share

గతేడాది కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే కేరళలో ఫర్మాన్ ఖాన్‌ను వివాహమాడారు. కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా జరిగిన ఈ అంతర్-మత వివాహం 'లవ్ జిహాద్' అంటూ తీవ్ర చర్చనీయాంశమైంది. తమ మతాలు సమానమేనని నూతన వధూవరులు ఖండించారు. సినిమా అవకాశం పేరుతో మోనాలిసాను కేరళకు తీసుకెళ్లి, ఆమెను పెళ్లి చేసుకునేలా ప్రేరేపించారని తండ్రి జయసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె నిర్ణయంపై నిస్సహాయత వ్యక్తం చేశారు.

గతేడాది ప్రయాగ్ రాజ్ కుంభమేళా లో పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది మోనాలిసా. మధ్యప్రదేశ్ కు చెందిన ఆమె తన తేనె కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాలిసా క్రేజ్ ను చూసి చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మోనాలిసా భోంస్లే ఇటీవల కేరళలో వివాహం చేసుకుంది. తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఫర్మాన్ ఖాన్‌ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. కేరళకు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు దగ్గరుండి మరీ వీరి వివాహం జరిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కొందరు మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ వివాహాన్ని ‘లవ్ జిహాద్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ నూతన వధూవరులు దీనిని ఖండించారు. తమకు అన్ని మతాలు సమానమేనన్నారు. ఇదిలా ఉంటే మోనాలిసా ప్రేమ వివాహంపై ఆమె తండ్రి జయసింగ్ భోంస్లే స్పందించారు. కొన్ని రోజుల క్రితం, కొంతమంది తమ ఇంటికి వచ్చారని చెప్పిన మోనాలిస తండ్రి జయసింగ్.. నటన లో శిక్షణ, సినిమా పనుల కోసం మోనాలిసాను తమ తో పాటు కేరళకు పంపమని అడిగారన్నాడు. ఇలాంటి విషయాల గురించి పెద్దగా తెలియని తాను.. అందుకు ఓకే చెప్పి.. మోనాలిసాతో కలిసి కేరళకు కూడా వెళ్లా అన్నాడు. అంతేకాదు మోనాలిసా వివాహం చేసుకున్న భర్త ఫర్మాన్ ఖాన్ కూడా ఇంటికి వచ్చిన బృందంలో ఉన్నాడని.. కానీ అప్పుడు తాను గుర్తించలేదన్నాడు జయసింగ్. ఇక కేరళకు వెళ్లగానే.. ఫర్మాన్ ఖాన్ లు పెళ్లి చేసుకుంటానని మోనాలిసా చెప్పిందని.. అయితే అందుకు తాను అభ్యంతరం చెప్పానంటూ తండ్రి జయ సింగ్ చెప్పాడు. దాంతో వారిద్దరూ…. కేరళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కోరారని చెప్పుకొచ్చాడు. మోనాలిసాకు ఇప్పటికే 18 సంవత్సరాలు కాబట్టి, ఆమె తనకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చని పోలీసులు చెప్పారని.. దీంతో తానేమీ చేయలేకపోయా అంటూ జయసింగ్ చెప్పుకొచ్చాడు. “కొంతమంది సినిమా అవకాశం కోసం నా కూతురిని కేరళకు పిలిపించుకున్నారు. మేము పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు. ఇదంతా ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. బహుశా ఎవరైనా నా బిడ్డను ప్రభావితం చేసి ఉండవచ్చు. ఆమె నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప మాకు ఇప్పుడు వేరే మార్గం లేదు. మాకు ముందే చెప్పి ఉంటే, మేమే పెళ్లి చేసేవాళ్లం” అంటూ మోనాలిసా మామ ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్

Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి

చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..

అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా

Follow Us