AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్

సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్

Phani CH
|

Updated on: Mar 15, 2026 | 6:29 PM

Share

భారతీయ సినిమాలకు సబ్‌టైటిల్స్ తప్పనిసరి చేస్తూ సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుండి అమలులోకి వచ్చే ఈ నిబంధన వినికిడి లోపం ఉన్నవారికి ఎంతో సహాయపడుతుంది. అయితే, ఈ మార్పు థియేటర్లలో ప్రేక్షకులను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు సబ్‌టైటిల్స్ దృష్టిని మరల్చగలవని, గందరగోళం సృష్టించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ సినిమాలపై సెన్సార్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్‌ టైటిల్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ఇండియన్ చిత్రాలకు సబ్ టైటిల్స్ ఉండాలని సూచించింది. ఈ నిర్ణయంతో వినికిడి లోపం ఉన్నవారికి సినిమా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. అయితే ఈ మార్పులు థియేటర్లలో ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై నెట్టింట ఇప్పుడు చర్చ కూడా మొదలైంది. అంతేకాదు సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను అన్ని రకాల ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో సెన్సార్ బోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు నెటిజన్లు స్వాగతిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఓకే కానీ.. మన చిత్రాలకు సబ్ టైటిల్స్ అవసరం లేదని కొందరు నెటిజన్లు అంటున్నారు.పైగా సబ్‌ టైటిల్స్ వల్ల.. ప్రేక్షకుడి దృష్టి సినిమాపై కాకుండా వాటిపైకే మల్లుతుందని అంటున్నారు. అంతేకాదు కొన్నిసార్లు నటీనటులు మాట్లాడనప్పుడు కూడా సబ్ టైటిల్స్ వస్తే కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి

చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..

అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా

భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..

Follow Us