AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్

Demon Pavan: ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు.. తట్టుకోలేక డీమాన్ భావోద్వేగ పోస్ట్

Phani CH
|

Updated on: Mar 15, 2026 | 6:37 PM

Share

బిగ్‌బాస్ డీమన్ పవన్ తండ్రి మరణం తీవ్ర విషాదం నింపింది. ఈ విషాద సమయంలో, వ్యూస్ కోసం తన తండ్రి మరణాన్ని కంటెంట్‌గా మార్చవద్దని పవన్ యూట్యూబర్స్ ను కోరారు. ఆర్థిక సాయం వార్తలను ఖండించారు. తప్పుడు థంబ్‌నెయిల్స్, వార్తలను మానుకోవాలని సూచించారు. నైతిక మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డీమాన్ పవన్ కుటుంబంలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. దీంతో డీమాన్ పవన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అలాగే బిగ్‌బాస్ సన్నిహితులు, అభిమానులు, నెటిజన్లు పవన్ కు సంతాపం ప్రకటించారు. దుర్గా ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థించారు. ఇదిలా ఉంటే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న డీమాన్ పవన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో తన తండ్రి మరణంపై సోషల్ మీడియాలో వస్తోన్న కొన్ని వార్తలు, థంబ్ నెయిల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దయ చేసి తన తండ్రి మరణవార్తను వ్యూస్ కోసం కంటెంట్‌గా మార్చకండి అంటూ యూట్యూబర్స్‌ను రిక్వెస్ట్ చేశాడు. తండ్రి అంత్యక్రియల కోసం కొంతమంది బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పవన్‌కు భారీగా ఆర్థిక సాయం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను పవన్ ఖండించాడు. తనకు ఎవరూ ఆర్థికంగా సహాయం చేయలేదన్నాడు. వ్యూస్, హైప్ కోసం తప్పుడు థంబ్‌నెయిల్స్ పెట్టడం, తప్పుడు వార్తలు పోస్ట్ చేయడం, షేర్ చేయడం మానుకోండి అంటూ సూచించాడు. వ్యూస్ కోసం మరీ దిగజారకండి అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. అంతేకాదు ఈ క్లిష్ట సమయంలో.. కొంతమంది తనకు ఫోన్ చేసి నైతిక మద్దతు ఇచ్చారని.. వారికి డీమాన్ ధన్యవాదాలు చెప్పాడు. అలాగే అంత్యక్రియలకు వచ్చి తన పక్కన నిలబడిన వారికి తాను కృతజ్ఞుడిని అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు పవన్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, అభిమానులు పవన్ కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి విషాద సమయాల్లో యూట్యూబ్ ఛానెళ్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్

సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్

Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి

Follow Us