Hair fall: రాలిన వెంట్రుక తిరిగి మొలవడానికి ఎన్ని రోజులు పడుతుంది.. తెలిస్తే ఆశ్చర్యపోతారు
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్య ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల నుండి యువత వరకు అనేక మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. తెల్ల వెంట్రుక కనపడగానే దానిని పీకేయడం, దానివల్ల పక్కన ఉన్న వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయనే అపోహ చాలామందిలో ఉంది. అయితే, ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. .

తెల్ల జుట్టు పీకడం వల్ల పక్క వెంట్రుకలు తెల్లబడవని. ఒక కుదురులోని మెలనోసైట్ కణాలు దెబ్బతినడం వల్ల ఆ కుదురు నుండి వచ్చే అన్ని వెంట్రుకలు తెల్లగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జుట్టు కుదుళ్ళలో రెండు లేదా మూడు వెంట్రుకలు ఉంటాయి. వెంట్రుకలు పుట్టుకతో నలుపు రంగులో ఉండవు. వాటి చుట్టూ ఉండే మెలనోసైట్స్ అనే కణాలు మెలనిన్ అనే నలుపు పదార్థాన్ని విడుదల చేయడం ద్వారా వెంట్రుకలకు రంగును అందిస్తాయి. ఈ మెలనోసైట్ కణాలు ఆరోగ్యంగా పనిచేయడానికి కొన్ని విటమిన్ డితో పాలు మరి కొన్ని పోషకాలు మనకు అవసరం. మన శరీరంలో ఆ పోషకాలు తగ్గినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. మన శరీరంలో మెలనోసైట్ కణాలు సరిగా పనిచేయకపోతే, మొదట వెంట్రుకలు గోధుమ రంగులోకి మారి, ఆ తర్వాత రంగు ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి తెల్లగా మారతాయి.
తెల్ల జుట్టు పీకడం వెనుక ఉన్న వాస్తవం
ఒక తెల్ల వెంట్రుకను పీకితే, ఆ స్థానం నుండి కొత్త వెంట్రుక మళ్లీ మొలుస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఒక వెంట్రుక కుదురు నుండి 20-21 సార్లు మొలిచే అవకాశం ఉంది. పీకిన వెంట్రుక తిరిగి మొలవడానికి సుమారు 20 రోజులు పడుతుంది, దీనిని రెస్టింగ్ పీరియడ్ అంటారు. కొన్ని ఔషధాలు లేదా సహజ చికిత్సలు ఈ రెస్టింగ్ పీరియడ్ ను తగ్గించి, త్వరగా వెంట్రుక మొలవడానికి సహాయపడతాయి. తెల్ల వెంట్రుక పీకడం వల్ల పక్కన ఉన్న వెంట్రుకలు తెల్లబడవు. ఒక కుదురులోని మెలనోసైట్ కణజాలం సూర్యరశ్మి లోపం, పోషకాహార లోపం లేదా ఇతర కారణాల వల్ల దెబ్బతిన్నప్పుడు, ఆ కుదురు నుండి వచ్చే అన్ని వెంట్రుకలకు రంగు వేయడం ఆగిపోతుంది. అప్పుడు మీరు ఒక తెల్ల వెంట్రుకను పీకినా, పక్కన ఉన్న ఇతర వెంట్రుకలు కూడా అదే కారణాల వల్ల తెల్లబడతాయి. దీనిని పీకడం వల్ల సంక్రమించే వ్యాధిగా భ్రమపడకూడదు.
తెల్ల జుట్టు నివారణకు పరిష్కారాలు
సూర్యరశ్మి: రోజుకు కనీసం అరగంట నుండి గంటసేపు ఉదయం 8-9 గంటల నుండి సాయంత్రం లోపు ఎండ తగిలేలా చూసుకోండి. ఇది మెలనోసైట్ కణాలను ఉత్తేజపరుస్తుంది.
ఆహారం: ప్రోటీన్ అధికంగా ఉండే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, హెంప్ సీడ్స్, సోయా గింజలు, రాజ్మా, ఆకుకూరలు వంటివి మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి మెలనిన్ ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. దీని వల్ల మీ జుట్టు ఆరోగ్యంతో పాలు తెల్లగా మారకుండా ఇవి సహాయ పడుతాయి.
నిద్ర: ప్రతిరోజు 7-8 గంటలు నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్ర మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది, ఇది కణజాల మరమ్మత్తుకు, మెలనోసైట్‌ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
ఒత్తిడి నియంత్రణ: ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, వ్యాయామం వంటి అలవాట్లను అలవర్చుకోవాలి. ఇవి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా తెల్ల జుట్టు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అపోహలను పక్కనపెట్టి, సరైన జీవనశైలిని అలవర్చుకోవడం వల్ల యుక్త వయసులో తెల్ల జుట్టు రాకుండా కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
