ఇలాంటి వారిని పెళ్లి చేసుకున్నారంటే..చాణక్యుడి హెచ్చరికలు!

16 April 2026

Jyothi Gadda

వేల సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్యుడు మానవ సంబంధాల గురించి, ముఖ్యంగా వైవాహిక జీవితం గురించి అనేక అమూల్యమైన సూత్రాలను అందించారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

పెళ్లి అనేది రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, రెండు జీవితాల ప్రయాణం. అందుకే భాగస్వామిని ఎంచుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని చాణక్యుడు సూచించారు.

చాణక్యుడి ప్రకారం, పెళ్లి అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం. కాబట్టి, భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోకూడదని చాణక్యుడు హెచ్చరించారు.

చాణక్యుడి ప్రకారం,..బాహ్య సౌందర్యం ఎప్పుడూ శాశ్వతం కాదని, ఒక వ్యక్తి అందం కంటే వారి గుణగణాలు, సంస్కారం మిన్న అని చాణక్యుడు అభిప్రాయపడ్డారు.

అందమైన ముఖం ఉన్నంత మాత్రాన వారు మంచి మనసున్న వారని చెప్పలేం. ఒకవేళ భాగస్వామి చాలా అందంగా ఉండి, చెడు స్వభావం, దుర్మార్గంగా ఉంటే, ఆ వివాహం ఎక్కువ కాలం నిలవదు. నిరంతరం గొడవలతో సాగుతుంది.

మంచి సంస్కారం ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందితే, వారు కష్టకాలంలో కూడా అండగా ఉంటారని చాణక్యుడు పేర్కొన్నారు. విపరీతమైన కోపం ఉన్నవారు ఇంట్లో ప్రశాంతతను దెబ్బతీస్తారని చెప్పారు.

ధనవంతులు లేదా అందగాళ్లు కాకపోయినా, మంచి విలువలు, సంస్కారం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారిని ఎంచుకోవడం వల్ల వైవాహిక బంధం దృఢంగా ఉంటుంది.

నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవి గమనించాల్సి ఉంటుంది. కష్టాలను తట్టుకునే ఓర్పు ఉన్న భాగస్వామి జీవితాన్ని సాఫీగా నడిపించగలరు. నైతిక విలువలు పాటించే వ్యక్తి కుటుంబ గౌరవాన్ని కాపాడతారు.

విషంలో ఉన్నా సరే అమృతాన్ని స్వీకరించాలి. అశుద్ధమైన చోట ఉన్నా సరే బంగారాన్ని వదులుకోకూడదు అని చాణక్యుడు చెప్పారు. అంటే, ఒక వ్యక్తి తక్కువ స్థాయిలో ఉన్నా వారిలో మంచి గుణాలు ఉంటే వారిని భాగస్వామిగా ఎంచుకోవడంలో తప్పు లేదు.