Garlic for Weight Loss: బరువు తగ్గడంలో వెల్లుల్లి సాయం.. ఇలా తిన్నారంటే రుచితోపాటు ఆరోగ్యం మీ సొంతం
ఆహారపు అలవాట్ల నుంచి ఒత్తిడి వరకు బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందువల్లనే నేటి కాలంలో అనేక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బుల సమస్యలు పెరుగుతాయి. ఊబకాయం శరీరంలో వేళ్లూనుకుపోయిందంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. బరువు తగ్గడానికి పచ్చి వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుందని..
Updated on: Nov 26, 2023 | 11:45 AM

ఆహారపు అలవాట్ల నుంచి ఒత్తిడి వరకు బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందువల్లనే నేటి కాలంలో అనేక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బుల సమస్యలు పెరుగుతాయి. ఊబకాయం శరీరంలో వేళ్లూనుకుపోయిందంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమవుతుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. బరువు తగ్గడానికి పచ్చి వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలాగంటే..

ఆయుర్వేదం ప్రకారం.. పచ్చి వెల్లుల్లి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పచ్చి వెల్లుల్లి కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కానీ పచ్చి వెల్లుల్లి వాసన, ఘాటు కారణంగా చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. పచ్చి వెల్లుల్లిని ఈ కింది విధంగా తిన్నారంటే రుచితోపాటు సులువుగా బరువు కూడా తగ్గొచ్చు.

గ్రీన్ టీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ గ్రీన్ టీని తయారుచేసేటప్పుడు కొంత పచ్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నీరు మరిగేటప్పుడు దీనిని వేసుకోవాలి. తర్వాత వడకట్టి సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి గ్రీన్ టీ సిద్ధం అయినట్లే. రుచి కోసం తేనె లేదా అల్లం కూడా వేసుకోవచ్చు.

డిటాక్స్ వాటర్ తాగడం వల్ల కూడా బరువు సులభంగా తగ్గొచ్చు. వెల్లుల్లిని దంచి వేడి నీటిలో కలపాలి. అందులో నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పుల్లని పెరుగులో పచ్చి వెల్లుల్లి తురుము కూడా కలపవచ్చు. వెల్లుల్లి తురుమును ఇతర వంటకాలతో కూడా వినియోగించవచ్చు.




