చలచల్లగా పుచ్చకాయ తిని.. ప్రశాంతంగా ఉందాం!

15 March 2026

TV9 Telugu

TV9 Telugu

ఎండ తాపం నుంచి కాపాడే పండ్లలో పుచ్చకాయ మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో వందకు పైగా రకాలున్నాయంటే అతిశయం కాదు. మన దగ్గర ఐదారు రకాలు మాత్రమే దొరుకుతాయి

TV9 Telugu

అదే జపాన్‌లో డబ్బాలా చతురస్రంలా ఉండేవాటిని కూడా సాగు చేస్తున్నారు. పుచ్చకాయ రంగు, ఆకారం ఎలా ఉన్నా.. వీటిల్లో పోషకాలు మాత్రం ఒకేటా ఉంటాయి

TV9 Telugu

పుచ్చకాయలో ఎ, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు, క్యాల్షియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. మంట, తాపాలను తగ్గిస్తుంది

TV9 Telugu

ఇందులో ఉన్న ఎ-విటమిన్‌ కంటిచూపును మెరుగుపరిస్తే, సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఈ కాలంలో తరచుగా పుచ్చకాయ తినడం మంచిది. 92 శాతం నీటితో ఉన్న పుచ్చకాయ తినడం వల్ల గొంతు తడారిపోవడం, ఒంట్లో నీరు ఇంకిపోవడం, డీహైడ్రేషన్‌ లాంటి సమస్యలు తలెత్తవు

TV9 Telugu

కండరాల నొప్పులను నిరోధిస్తుంది. ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ బొత్తిగా ఉండదు. గుండె జబ్బులను రానీయదు. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని పెరగనివ్వదు

TV9 Telugu

జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయ తినడం వల్ల ఆకలి తీరిన భావన కలుగుతుంది. ఇంకా ఇంకా తినాలనే తపన ఉండదు. ఈ కారణం వల్ల ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. ఊబకాయం రాదు

TV9 Telugu

బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది శ్రేష్ఠం. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. కీళ్లనొప్పులు రావు. ఆశ్చర్యం ఏమిటంటే ఇది మానసిక ప్రశాంతతను చేకూర్చి మెరుగైన ఆలోచనలకు దారితీస్తుంది

TV9 Telugu

ఇది కొంతవరకూ క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. సాధారణంగా లోపలి ఎర్రటి భాగాన్నే తింటాం కానీ పైనున్న చెక్కు కూడా చాలా మంచిదట. ఇక పుచ్చ గింజల్లో గొప్ప పోషకాలుంటాయి. తక్కువ కెలొరీలు, ఎక్కువ పోషకాలుంటాయి. పీచు పదార్థం, నీరూ ఎక్కువే. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది