AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆరోజే అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు

రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. రైతులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అన్నదాతలకు అండగా నిలించేందుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Rythu Bharosa: రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆరోజే అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు
Telangana Rythu Bharosa
Prabhakar M
| Edited By: |

Updated on: Mar 15, 2026 | 6:57 PM

Share

తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ఈ నెల 22న విడుదల చేయాలని నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రైతులకు ఆర్థిక సహాయం త్వరగా అందేలా విడతల వారీగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొదటి విడతలో సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,590 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఒక ఎకరం వరకు ఉన్న రైతులకు ఈ విడతలో రైతు భరోసా నిధులు అందనున్నాయి. నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత విడుదలైన 20 రోజుల తర్వాత రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ దశలో సుమారు రూ.2,650 కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

అలాగే ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత నిధులను కూడా విడుదల చేసి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడు విడతల్లో కలిపి దాదాపు రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎవ్వరూ బ్రేక్ చేయలేని లిస్ట్‌లో సన్‌రైజర్స్ నయా బ్రహ్మాస్త్రం.!
ఎవ్వరూ బ్రేక్ చేయలేని లిస్ట్‌లో సన్‌రైజర్స్ నయా బ్రహ్మాస్త్రం.!
వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి
వారికి సుదీర్ఘ ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట