AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New UG and PG Courses 2026: ఖరీదైన ఏవియేషన్‌, క్లైమాట్‌ సైన్స్, మారిటైమ్ టెక్నాలజీ కోర్సులు.. ఇక మన వర్సిటీల్లోనే!

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) రాష్ట్ర విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వర్సిటీల్లో పలు కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌పోర్టు అండ్‌ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, మారిటైమ్ టెక్నాలజీకి సంబంధించి క్లైమేట్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ నుంచి..

New UG and PG Courses 2026: ఖరీదైన ఏవియేషన్‌, క్లైమాట్‌ సైన్స్, మారిటైమ్ టెక్నాలజీ కోర్సులు.. ఇక మన వర్సిటీల్లోనే!
new UG PG courses in Telangana Universities
Srilakshmi C
|

Updated on: Mar 15, 2026 | 6:06 PM

Share

హైదరాబాద్, మార్చి 15: తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) రాష్ట్ర విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వర్సిటీల్లో పలు కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌పోర్టు అండ్‌ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, మారిటైమ్ టెక్నాలజీకి సంబంధించి క్లైమేట్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ నుంచి మెడికల్ మైక్రోబయాలజీ వరకు పలు ఖరీదైన కోర్సులు ఇప్పుడు తెలంగాణ వర్సిటీకి వచ్చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి పలు కొత్త అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.

ఈ కొత్త కోర్సులు ఇంటిగ్రేట్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లీగల్‌ ఫ్రేమ్‌వర్క్స్‌, సెక్టోరల్‌ ఎక్స్‌పర్టైజ్ రంగాలకు చెందినవి. ఇందులో యూజీ, పీజీ పట్టభద్రులైన తర్వాత విద్యార్ధులు సులభంగా ఉపాధి పొందగలిగేలా కోర్సులను రూపొందిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సులను మూడేళ్లు, నాలుగేళ్ల ఆనర్స్‌తో ఈ కోర్సులను అందిస్తున్నారు. ఈ కోర్సులకు బహుళ ప్రవేశాలు, నిష్క్రమణ సదుపాయం కూడా ఉంటుంది. అంటే విద్యార్థులు ప్రతి విద్యా సంవత్సరం తర్వాత ఈ కోర్సు నుంచి నిష్క్రమించవచ్చు. ఇలా ఏడాది తర్వాత నిష్ర్కమిస్తే సర్టిఫికేట్ అందజేస్తారు. రెండేళ్లు పూర్తి చేస్తే డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్ల తర్వాత డిగ్రీ పట్టా అందిస్తారు. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు రీసెర్చ్‌ చేసేందుకు ఆనర్స్, రీసెర్చ్‌ డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు అర్హత సాధిస్తారు.

యువతలో నైపుణ్య అంతరాలను తగ్గించడానికి, ఉపాధి అవకాశాలను పెంచడానికి అన్ని నేపథ్యాల నుంచి యువతకు సాధికారత కల్పించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించినట్లు TGCHE చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్ట రెడ్డి తెలిపారు. విద్యార్ధులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించేందుకు పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. అడ్వైజరీ బోర్డులు, ఇంటర్న్‌షిప్‌లు, అధ్యాపక అభివృద్ధికి పరిశ్రమ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఏవియేషన్, క్లైమాట్ సైన్స్, మారిటైమ్ కోర్సులు ఇక మన వర్సిటీల్లోనే!
ఏవియేషన్, క్లైమాట్ సైన్స్, మారిటైమ్ కోర్సులు ఇక మన వర్సిటీల్లోనే!
చెప్పులు వేసుకుని వంట చేస్తున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..
చెప్పులు వేసుకుని వంట చేస్తున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే..
పెట్టుబడిదారులకు గోల్డెన్‌ ఛాన్స్‌!
పెట్టుబడిదారులకు గోల్డెన్‌ ఛాన్స్‌!
జ్యూస్ కంటే పండ్లు తినడం ఎందుకు మంచిది? ఆరోగ్య లాభాలు vs జ్యూస్..
జ్యూస్ కంటే పండ్లు తినడం ఎందుకు మంచిది? ఆరోగ్య లాభాలు vs జ్యూస్..
అబ్బ సాయిరాం.. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణశాఖ
అబ్బ సాయిరాం.. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణశాఖ
గుడ్ న్యూస్.. గ్యాస్ ధరలను భారీగా తగ్గించిన ఆదానీ గ్రూప్..
గుడ్ న్యూస్.. గ్యాస్ ధరలను భారీగా తగ్గించిన ఆదానీ గ్రూప్..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
సీబీఎస్సీ 12వ తరగతి 2026 అన్ని పరీక్షలు రద్దు! కారణం ఇదే..
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..