వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస పండు ఒకటి. భారీ పరిమాణంతో ఉండే పండు చూడ్డానికి వింతగా కనిపించినా.. అందులోని పనస తొనలు నోరూరిస్తాయి. ఈ తొనలు కేవలం రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది
TV9 Telugu
అందుకే పనసపండును ఆయుర్వేదంలో ఔషధ గని అని పిలుస్తారు. అన్ని ఔషధ గుణాలు కలిగిన పనస పండును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి
TV9 Telugu
పనసపండు తినడం వల్ల శరీరానికి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. పనసలో ఫైబర్, విటమిన్- సి, విటమిన్- ఎ, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, భాస్వరం, కాల్షియం కూడా ఉంటాయి
TV9 Telugu
ఇది బీటా కెరోటిన్, లుటిన్, మరియు జియాక్సంతిన్లతో సహా గణనీయమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంది. అయితే వీటిన్నింటికన్నా ఎక్కువ .. ఈ పసనపండు ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో గణనీయమైన మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది
TV9 Telugu
జాక్‌ఫ్రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల.. చర్మ సంరక్షణ మెరుగవుతుంది. బరువు తగ్గుతారు, జీర్ణక్రియ బాగుంటుంది. శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ ఆరోగ్యం మెరుగ్గా పనిచేస్తుంది. రక్తపోటు తగ్గుతుంది. నిద్రను ప్రేరేపిస్తుంది. పనసపండును అనేక మార్గాల్లో తీసుకోవచ్చు
TV9 Telugu
పనసపండును తినడమంటే కఠినమైన బాహ్య కవచాన్ని తెరవడం, పండు కోరును తొలగించి తినడం. పచ్చిది, కాల్చినది, ఉడికించినది ఎలాగైనా తినచ్చు. అలాగే మీకు ఇష్టమైన చాలా రకాల వంటలైన సలాడ్లలో, ప్రోటీన్ ఎంట్రీగా, కూర లోపల, డెజర్ట్ లలో వీటిని చేర్చుకుని తినచ్చు
TV9 Telugu
పనస తొనలు తినడానికి తియ్యగా, ఎంతో రుచిగా ఉంటాయి. పనస తొనలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి
TV9 Telugu
అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం పనస తొనలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్, కిడ్నీ రోగులు, అలెర్జీ సమస్యలు, ఆపరేషన్ తర్వాత, ప్రెగ్నెన్సీ సమయంలో పనస తొనలు ఎవరు తినకూడదని నిపుణులు చెబుతున్నారు