AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు అరటిపండ్లు 15 రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..

మనలో చాలా మంది ప్రతిరోజూ అరటిపండ్లు తింటారు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారికి, పిల్లలకు ఇది తక్షణ శక్తినిచ్చే అద్భుతమైన ఆహారం. అయితే అరటిపండ్లతో వచ్చే ప్రధాన సమస్య ఏమిటంటే.. అవి కొన్న రెండు మూడు రోజులకే మెత్తబడి, నల్లటి మచ్చలు పడిపోతాయి. ఒకేసారి ఎక్కువ అరటిపండ్లు కొన్నప్పుడు అవి పాడైపోయి పారవేయాల్సి వస్తుంది. ఇకపై అలాంటి చింత అక్కర్లేదు, అరటిపండ్లను 10 నుండి 15 రోజుల పాటు తాజాగా దృఢంగా ఉంచే అద్భుతమైన టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం.

Krishna S
|

Updated on: Mar 15, 2026 | 7:28 PM

Share
గాలి తగిలేలా ఉంచండి: అరటిపండ్లను నిల్వ చేసే ప్రదేశం కూడా చాలా ముఖ్యం. అరటిపండ్లను ఎప్పుడూ రిఫ్రిజిరేటర్లలో, ఓవెన్ల దగ్గర లేదా ప్రత్యక్ష సూర్యకాంతి తగిలే చోట ఉంచకూడదు. వీటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద, గాలి తగిలే చోట ఉంచాలి. వీలైతే అరటిపండ్లను వేలాడదీయడం వల్ల వాటిపై ఒత్తిడి పడకుండా నల్లబడకుండా ఉంటాయి.

1 / 5
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. బలహీనమైన మూత్రపిండాలు ఉన్నవారు శరీరం నుంచి అదనపు పొటాషియంను విసర్జించడంలో ఇబ్బంది పడతారు. ఇటువంటి వారికి అరటిపండ్లు తినడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.

2 / 5
అరటిపండ్లను విడిగా ఉంచండి: చాలా మంది అరటిపండ్లను గుత్తిగానే ఉంచుతారు. కానీ మీరు ఇంటికి తీసుకువచ్చిన వెంటనే వాటిని కాండాల నుండి వేరు చేసి విడిగా ఉంచడం మంచిది. ఇలా ఒక్కొక్కటిగా విడదీయడం వల్ల ఇథిలీన్ గ్యాస్ ప్రభావం తగ్గి, పండ్లు ఒకేసారి మెత్తబడకుండా ఉంటాయి. వీలైతే విడదీసిన ప్రతి అరటిపండు కాండానికి కూడా చిన్న అల్యూమినియం ఫాయిల్ చుడితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

3 / 5
ఇతర పండ్లతో స్నేహం వద్దు: పండ్ల గిన్నెలో అన్ని రకాల పండ్లను కలిపి ఉంచే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఆపిల్, మామిడి, అవకాడో, టమోటాలు కూడా ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. వీటి పక్కన అరటిపండ్లను ఉంచితే అవి వేగంగా పండిపోయి పాడైపోతాయి. కాబట్టి అరటిపండ్లను ఎప్పుడూ ఇతర పండ్లకు దూరంగా విడిగా ఉంచండి.

4 / 5
అరటిపండ్లు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు తరచుగా వచ్చేవారు అరటిపండ్లు తినకుండా ఉండాలి. రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల కఫం పెరిగే అవకాశం ఉంది.

5 / 5
Follow Us