కరివేపాకుతో జాగ్రత్త..! ఎవరెవరు దూరంగా ఉండాలి?

Jyothi Gadda

02 November 2026

అయితే కరివేపాకు మంచిదే కదా అని విపరీతంగా తినడం లేదా ఔషధాల రూపంలో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలతో బాధపడే లో-షుగర్ వ్యాధిగ్రస్తులు కరివేపాకుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తక్కువ రక్తపోటు (లో బీపీ) సమస్య ఉన్నవారు కూడా కరివేపాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఎదురుకావచ్చు.

కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు కరివేపాకును ఔషధంగా వాడే ముందు వైద్యులను సంప్రదించాలి.

గర్భధారణ సమయంలో మహిళలు కరివేపాకు రసం లేదా కషాయాలను మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

కొందరి శరీర తత్వానికి కరివేపాకు సరిపడక చర్మంపై దద్దుర్లు, దురద లేదా జీర్ణ సంబంధిత అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.

కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా, దీర్ఘకాలిక మందులు వాడుతున్నవారైనా వైద్యుల సలహా మేరకే కరివేపాకును పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.

పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో తాలింపుగా వేసే ఆకులను పరిమితంగా తీసుకోవాలి తప్ప ఉదయాన్నే కరివేపాకు రసాలు తాగడం, స్పూన్ల కొద్దీ కరివేపాకు కారప్పొడులు తినడం మానుకోవాలి.