Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏమీ తినాలి అనిపించడం లేదా.. ఈ దోశలను అప్పటికప్పుడు కార కారంగా వేసుకోండి!

ప్రతి రోజూ తినే ఆహారాల్లో దోశలు కూడా ఒకటి. దోశలు అంటే చాలా మందికి ఇష్టం. ఇక దోశల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. చాలా రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు దోశల్లో చాలా రకాలు ఫేమస్ అయ్యాయి. కొన్ని రకాల దోశలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. అయితే ఒక్కోసారి ఏమీ తినాలి అనిపించదు. అందులోనూ చలి కాలంలో అన్నం అస్సలు ఎక్కదు. ఎప్పుడూ తినే కూరలు, టిఫిన్లు కాకుండా.. ఇలా వెరైటీగా కార కారంగా ఉండే దోశలు తయారు చేసుకోండి. నోటికి రుచిగా ఉంటూ..

ఏమీ తినాలి అనిపించడం లేదా.. ఈ దోశలను అప్పటికప్పుడు కార కారంగా వేసుకోండి!
Ghee Karam Dosa
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 26, 2023 | 9:25 PM

ప్రతి రోజూ తినే ఆహారాల్లో దోశలు కూడా ఒకటి. దోశలు అంటే చాలా మందికి ఇష్టం. ఇక దోశల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. చాలా రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు దోశల్లో చాలా రకాలు ఫేమస్ అయ్యాయి. కొన్ని రకాల దోశలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. అయితే ఒక్కోసారి ఏమీ తినాలి అనిపించదు. అందులోనూ చలి కాలంలో అన్నం అస్సలు ఎక్కదు. ఎప్పుడూ తినే కూరలు, టిఫిన్లు కాకుండా.. ఇలా వెరైటీగా కార కారంగా ఉండే దోశలు తయారు చేసుకోండి. నోటికి రుచిగా ఉంటూ.. అలా ఒక్కోటి వెళ్తూనే ఉంటాయి. ఎంతి తిన్నా మళ్లీ మళ్లీ తినాలని అనిపిస్తుంది. రోడ్ల మీద తయారు చేసే దోశల్లో ఘీ కారం దోశలు కూడా ఒకటి. వీటిని తయారు చేసుకోవడానికి పిండి రుబ్బే పని ఉండదు. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవాలి. మరి వీటిని ఎలా తయారు చేస్తారు? ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.

ఇన్ స్టెంట్ ఘీ కారం దోశకు కావాల్సిన పదార్థాలు:

పెరుగు, గోధుమ పిడి, ఉప్మా రవ్వ, నెయ్యి, కారం, వంట సోడా, ఉప్పు.

ఇవి కూడా చదవండి

ఇన్ స్టెంట్ ఘీ కారం దోశ తయారీ విధానం:

ముందుగా ఒక జార్ లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుని.. కాస్త బరకగా ఉండేలా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల గోధుమ పిండి, కొద్దిగా పెరుగు, ఉప్పు, నీళ్లు వేసి దోశ పిండిలా కలుపు కోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిలో వంట సోడా వేసి బాగా కలుపుకుని ఓ పది నిమిషాల పాటు పక్కకు పెట్టు కోవాలి. ఆ తర్వాత చిన్న బౌల్ లోకి కొద్దిగా నెయ్యిని, వేరే బౌల్ లోకి కొద్ది గా కారం తీసుకోవాలి. పది నిమిషాల తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి హీట్ చేసుకోవాలి.

ఇప్పుడు పక్కకు పెట్టుకున్న దోశ పిండిని తీసుకుని.. పెనం మీద పల్చగా వేసుకోవాలి. ఆ తర్వాత దోశ తడి ఆరాక.. ఇందులో కారం, నెయ్యి వేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలి. కావాలనుకున్న వాళ్లు ఈ దోశపై ఉల్లి పాయ ముక్కలు, కొత్తిమీర, చీజ్ కూడా వేసుకోవచ్చు. ఈ ఘీ కారం దోశను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటా చట్నీ లేదా పల్లీల చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్లకు ఇలా చేసి పెడితే మళ్లీ మళ్లీ ఇలాగే కావాలని అడుగుతారు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..