AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరికలు, లాభాలు తప్పక తెలుసుకోండి…

గుడ్డు అనేది సంపూర్ణ ఆహారంగా (Complete Food) గుర్తింపు పొందింది. కానీ గుడ్డులోని పచ్చసొన (Egg Yolk) విషయంలో మాత్రం చాలా మందికి సందేహాలే ఎక్కువ. కొందరు పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని దూరంగా ఉంటారు. మరికొందరు ఇందులో ఉన్న పోషకాల వల్ల తినాలని సూచిస్తారు. అయితే నిజంగా పచ్చసొన తింటే లాభమా? నష్టమా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం.

గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరికలు, లాభాలు తప్పక తెలుసుకోండి...
Egg Yolk Benefits
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2026 | 9:43 PM

Share

కోడిగుడ్డు మనకు మంచి పోషకాహారం. అందుకే రోజూ గుడ్డు తినమని వైద్యులు పదే పదే చెబుతుంటారు. అయితే చాలా మంది కోడిగుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతుంటారు. అసలు పచ్చసొన తినడం మంచిదేనా? అంటే.. పరిశోధనల ప్రకారం పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్న మాట వాస్తవమే. కానీ, ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ అందరిలో బ్లడ్ కొలెస్ట్రాల్‌ను పెంచదు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు ఒకటి తిన్నా పెద్దగా ప్రమాదం ఉండదు.

ఎగ్ యోక్‌లో కేవలం కొవ్వు మాత్రమే కాదు… విటమిన్ A, D, E, B12 తో పాటు ఐరన్, కాల్షియం మరియు జింక్ వంటి ఆరోగ్యానికి మంచి చేసే పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, రోగనిరోధక పచ్చసొనలో ‘కోలిన్’ అనే ముఖ్యమైన పోషకం ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పెరుగుతున్న పిల్లలకు గుడ్డు ఇవ్వడం మంచిదని నిపుణులు చెబుతారు.

పచ్చసొనలో లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలను తగ్గించి, చూపును మెరుగు పరచడానికి సహాయం చేస్తాయి. సాధారణ వ్యక్తులు రోజుకు ఒక పూర్తి గుడ్డు తినడం సురక్షితం. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, జిమ్ వెళ్లేవారు డాక్టర్ లేదా ట్రైనర్ సలహాతో ఎక్కువగా కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గుడ్డును ఉడకబెట్టి తినడం అత్యంత ఆరోగ్యకరం. ఆమ్లెట్ లేదా ఫ్రై రూపంలో ఎక్కువ నూనె, ఉప్పు, మసాలాలు చేర్చి తినడం వల్ల గుడ్డతో పాటు పచ్చసొనలోని ప్రయోజనాలు తగ్గుతాయి. మితంగా తీసుకుంటే కోడిగుడ్డు శరీరానికి ఉపయోగకరమైన మంచి పోషకాహారం!

గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ లేదా డయాబెటిస్ ఉన్నవారు పచ్చసొన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us