Aloo Stuffed Mirchi Bajji: ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా.. మిస్ అయినట్టే!

సాయంత్రం వేళలో అందరికీ బాగా గుర్తొచ్చే ఐటెమ్ ఏదంటే పచ్చి మిర్చి బజ్జీలు. అందులో చలి కాలం, వర్షా కాలంలో వేడి వేడిగా తింటే.. ఇక మాటలు ఉండవు. ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్లు ఈ బజ్జీలను తయారు చేసుకుంటారు. ఇలా ప్రాంతాలను బట్టి బజ్జీల టేస్టులు మారిపోతుంటాయి. అలాగే ఎప్పుడైనా ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీ తిన్నారా. ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఎక్కువగా రోడ్ సైడ్ బండ్ల మీద వేస్తూంటారు. మీరు ఎప్పుడైనా తిన్నారా..

Aloo Stuffed Mirchi Bajji: ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా.. మిస్ అయినట్టే!
Aloo Stuffed Mirchi Bajji
Follow us
Chinni Enni

|

Updated on: Oct 17, 2023 | 8:50 PM

సాయంత్రం వేళలో అందరికీ బాగా గుర్తొచ్చే ఐటెమ్ ఏదంటే పచ్చి మిర్చి బజ్జీలు. అందులో చలి కాలం, వర్షా కాలంలో వేడి వేడిగా తింటే.. ఇక మాటలు ఉండవు. ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్లు ఈ బజ్జీలను తయారు చేసుకుంటారు. ఇలా ప్రాంతాలను బట్టి బజ్జీల టేస్టులు మారిపోతుంటాయి. అలాగే ఎప్పుడైనా ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీ తిన్నారా. ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఎక్కువగా రోడ్ సైడ్ బండ్ల మీద వేస్తూంటారు. మీరు ఎప్పుడైనా తిన్నారా.. లేకుంటే టేస్ట్ మిస్ అయినట్టే. అంత టేస్టీగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయి ఇవి. పండుగ సమయాల్లో, వీకెండ్ సమయాల్లో చేసుకుని తింటే సూపర్ గా ఉంటాయి. గెస్టులు వచ్చినప్పుడు చేశారంటే.. వాళ్లు పొగుడుతూనే ఉంటారు. పైన క్రిస్పీ లేయర్.. లోపల సాఫ్ట్ గా టేస్టీగా, స్పైసీగా ఆలూ స్టవ్ భలేగా ఉంటుంది. మరి ఈ ఆటూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీలను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆలూ స్టఫ్డ్ మిర్చీ బజ్జీలకు కావాల్సిన పదార్థాలు:

ఉడకబెట్టిన బంగాళా దుంపలు, చనగ పిండి, బజ్జీ మిర్చీ, నూనె, ఉప్పు, కారం, కొత్తి మీర, చాట్ మసాలా, గరం మసాలా, వాము లేదా జీలకర్ర, నిమ్మ రసం, వంట సోడా, ఉల్లిపాయ.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా ఒక మంద పాటి ఖాళీ కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈలోపు మరో స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకుని అందులో కొద్దిగా నూనె పోసి.. జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించు కోవాలి. ఇవి వేగించిన తర్వాత.. ఉడకబెట్టిన బంగాళా దుంపలు బాగా మెదుపుకుని వేసుకోవాలి. ఇది రెండు నిమిషాలు వేగాక.. కారం, ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి.. కొత్తి మీర చల్లుకుని, నిమ్మ రసం కలుపుకోవాలి. ఇది పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మిర్చీ బజ్జీలను తీసుకుని వాటిని వాష్ చేసుకుని మధ్యలో గాటు పెట్టుకుని.. గింజలను తీసేసి.. అందులో తయారు చేసి పెట్టుకున్న ఆలూ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇలా అన్ని మిర్చీల్లో ఆలూ మిశ్రమాన్ని పెట్టుకుని పక్కకు ఉంచాలి. ఆ తర్వాత ఒక లోతైన గిన్నెలో శనగ పిండిని తీసుకోవాలి.

ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. ఇక ఇందులో బజ్జీల మిశ్రమానికి సరిపడగా బ్యాటర్ సిద్ధం చేసుకోవాలి. ఆలూ స్టఫ్డ్ పెట్టిన మిర్చీలను చనగ పిండి బ్యాటర్ లో ముంచి నూనెలో వేసుకోవాలి. ఇవి మొత్తం రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకుని నిమ్మకాయ, ఉల్లిపాయలు, టమాటా కిచప్ తో సర్వ్ చేసుకోవడమే. ఇష్టమైన వాళ్లు అల్లం చట్నీతో కూడా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెదుకు లేట్ ఇలా వెరైటీగా ఆలూతో బజ్జీలను చేసుకోండి.. అందరితో సూపర్ అనిపించుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.