వీటిని తింటే ఒంట్లో కొలెస్ట్రాల్‌ వెన్నలా కరగాల్సిందే

04 March 2026

TV9 Telugu

TV9 Telugu

మనం రోజూ తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉంటేనే ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. అలాగే అన్ని రకాల వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండచ్చు

TV9 Telugu

ఆహారంలో పండ్లు, కూరగాయల్ని నిత్యం తీసుకోవడం మంచిది. అలాగే చేపల్ని కూడా ఆహారంలో భాగం తీసుకోవాలి. చేపల్లో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

TV9 Telugu

ముఖ్యంగా చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని ఆనేక పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది. అయితే చాలా మంది వారానికి, లేదంటే నెలకు ఒకసారి మాత్రమే తీసుకుంటూ ఉంటారు

TV9 Telugu

కొందరు అసలే తినరు. ఎందుకంటే... చేపలు  ప్రెగ్నెన్సీ, పాలిచ్చే సమయంలో తల్లులు తినడమే కాదు... ఎదిగే పిల్లలకు వారానికి కనీసం రెండు చేప ముక్కలను తినిపించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు

TV9 Telugu

వీటిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం, అయోడిన్‌ వంటివి పిల్లల ఎదుగుదలకు సాయపడతాయట. కాబట్టి, ఇప్పటికీ మొదలుపెట్టని వారెవరైనా ఉంటే ఇక నుంచైనా చేపను పిల్లల ఆహారంలో భాగం చేసేయండి అంటున్నారు పరిశోధకులు

TV9 Telugu

చేపలు రక్తనాళాలను శుద్ధి చేస్తూ వాటిలో కొలెస్ట్రాల్‌ పేరుకొనిపోకుండా చూస్తాయి. చేపలను వారానికి రెండురోజులు తినడం చాలా మంచిది. 300-400 గ్రాముల వరకు వినియోగించవచ్చు

TV9 Telugu

ఒమేగా -3 ప్యాటీ యాసిడ్స్‌తో రక్తనాళాలు పూడుకొని పోకుండా చేస్తుంది. రక్తం పలుచ పడేందుకు దోహదపడుతుంది. రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది

TV9 Telugu

గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చేపలు మంచిరకం ప్రోటీన్లు కావడంతో శరీరానికి మేలు చేస్తుంది