AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bottle Cleaning: వాటర్ బాటిల్స్, క్యాన్లలో పాచి పట్టిందా?.. ఈ చిట్కాలతో బ్యాక్టీరియాకు చెక్ పెట్టండి!

ప్రతిరోజూ మనం తాగే నీరు ఎంత శుద్ధంగా ఉందో చూసుకుంటాం కానీ, ఆ నీటిని నిల్వ చేసే క్యాన్లు లేదా బాటిళ్లు ఎంత శుభ్రంగా ఉన్నాయో పట్టించుకోం. చాలా ఇళ్లలో, ఆఫీసుల్లో 20 లీటర్ల వాటర్ క్యాన్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, వీటిని సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోతే లోపల పాచి (Algae) పేరుకుపోయి, ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు నిలయంగా మారుతాయి. మురికిని, దుర్వాసనను వదిలించి మీ వాటర్ క్యాన్లను తళతళా మెరిసేలా చేసే సులువైన చిట్కాలు ఇప్పుడు మీ కోసం..

Bottle Cleaning: వాటర్ బాటిల్స్, క్యాన్లలో పాచి పట్టిందా?.. ఈ చిట్కాలతో బ్యాక్టీరియాకు చెక్ పెట్టండి!
How to clean water cans
Bhavani
|

Updated on: Mar 04, 2026 | 8:07 PM

Share

నీటి రుచి మారినా లేదా బాటిల్ లోపల వేలితో తాకినప్పుడు జిగటగా అనిపించినా.. అందులో బ్యాక్టీరియా చేరిందని అర్థం. ముఖ్యంగా బాటిల్ మూతలు, రబ్బరు రింగుల సందుల్లో ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. ఖరీదైన కెమికల్స్ అవసరం లేకుండా మన వంటింట్లో దొరికే బియ్యం, నిమ్మరసం, బేకింగ్ సోడాతోనే వీటిని ఎలా డీప్ క్లీన్ చేయాలో తెలుసుకుందాం.

1. బేకింగ్ సోడా, వెనిగర్:

మొండి వాసనలను పోగొట్టడంలో ఇది దిట్ట. క్యాన్‌లో 2 స్పూన్ల బేకింగ్ సోడా, అర కప్పు వెనిగర్ వేసి, గోరువెచ్చని నీటితో నింపి బాగా షేక్ చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే బ్యాక్టీరియా మటుమాయం.

2. బియ్యం లేదా కల్లు ఉప్పు ట్రిక్:

క్యాన్ లోపలికి చెయ్యి వెళ్ళనప్పుడు.. గుప్పెడు బియ్యం లేదా కల్లు ఉప్పు వేసి కొద్దిగా నీటితో వేగంగా ఊపాలి. ఆ గింజల రాపిడికి లోపల ఉన్న పాచి మొత్తం వదిలిపోతుంది.

3. నిమ్మరసం ప్రభావం:

ప్లాస్టిక్ వాసన వస్తున్నట్లయితే నిమ్మరసం కలిపిన నీటిని ఒక గంట పాటు ఉంచి కడిగేయండి. ఇది సహజమైన డిస్-ఇన్ఫెక్టెంట్‌గా పనిచేస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఎండలో ఆరబెట్టండి: కడిగిన తర్వాత క్యాన్లను బోర్లించి ఉంచకుండా కాసేపు ఎండలో పెడితే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.

మూతలు మర్చిపోవద్దు: బాటిల్ మూతలు, వాటి లోపల ఉండే రబ్బరు రింగులను విడదీసి బ్రష్‌తో క్లీన్ చేయాలి.

క్రమం తప్పకుండా: వారానికి కనీసం ఒక్కసారైనా డీప్ క్లీనింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. పైన పేర్కొన్న చిట్కాలు వివిధ అధ్యయనాలు సాధారణ సమాచారం ఆధారంగా అందించబడ్డాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తల కోసం ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నీటిని, శుభ్రమైన పాత్రలను వాడండి.

Follow Us
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
పసికందును బిడ్డకు అప్పజెప్పి పనికి వెళ్లిన తల్లిదండ్రులు..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
చెప్పుకోండి చూద్దాం.! మనుషులను చూసి సిగ్గుపడే జంతువు ఏదో తెల్సా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
పదేళ్ల విధ్వంసాన్ని తుడిచేస్తున్నాం.. అడ్డుపడితే అడ్రస్ లేకుండా..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
ఏపీ రైతుల కోసం కొత్త యాప్.. అన్నీ ఒకేచోట
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
మీ బంగారు నగలకు పెద్ద శత్రువు ఈ చిన్న పదార్థం ! జస్ట్‌ టచ్‌చేస్తే
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
కావ్యా కోసం క్యూ కట్టిన ప్రేమికులు.. స్టేడియంలోనే గులాబీలతో ప్రేమ
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
శంషాబాద్‌లో బుల్లెట్ రైళ్ల కోసం భారీ టెర్మినల్.. 600 ఎకరాల్లో..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
ఎండాకాలంలో తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి..
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!
50 అడుగుల బావిలోంచి ఒకటే అరుపులు.. ఏంటా అని చూసిన రైతులు షాక్‌!