Muscle Cramps: నిద్రలో కండరాలు, పిక్కలు పట్టేస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వాల్సిందే!

మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా రక రకాల వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, సమస్యలు వెంటాడుతున్నాయి. అలా చాలా మంది ఎదుర్కొంటున్న వాటిల్లో తొడ కండరాలు, పిక్కలు పట్టేయడం కూడా ఒకటి. పగలంతా ఎలా ఉన్నా.. నిద్ర మాత్రం ఇలా ఒక్కోసారి జరుగుతుంటుంది. ఇలా పిక్కలు, తొడ కండరాలు పట్టేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. వయస్సు మీద పడటం, పోషకాహార లోపం, వివిధ రకాల గేమ్స్ ఆడటం, వ్యాయామం చేస్తున్నప్పుడు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు..

Muscle Cramps: నిద్రలో కండరాలు, పిక్కలు పట్టేస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వాల్సిందే!
Cramps
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 17, 2023 | 10:00 PM

మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా రక రకాల వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు, సమస్యలు వెంటాడుతున్నాయి. అలా చాలా మంది ఎదుర్కొంటున్న వాటిల్లో తొడ కండరాలు, పిక్కలు పట్టేయడం కూడా ఒకటి. పగలంతా ఎలా ఉన్నా.. నిద్ర మాత్రం ఇలా ఒక్కోసారి జరుగుతుంటుంది. ఇలా పిక్కలు, తొడ కండరాలు పట్టేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. వయస్సు మీద పడటం, పోషకాహార లోపం, వివిధ రకాల గేమ్స్ ఆడటం, వ్యాయామం చేస్తున్నప్పుడు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల కూడా పిక్కలు లేదా తొడ కండరాలు పట్టేస్తుండటం జరుగుతూ ఉంటాయి. నిద్రలో సడెన్ గా పిక్కలు పట్టడం వల్ల విపరీతంగా నొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాలు చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఐస్ రాయాలి:

కండరాలు పట్టినప్పుడు లేదా పిక్కలు పట్టేసినప్పుడు విపరీతమైన బాధ వస్తుంది. కాసేపటి వరకు కాలు కదపలేం.. నొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే ఐస్ ముక్కలను ఒక క్లాత్ లో వేసి లేదంటే ఐస్ ప్యాక్ అయినా పర్వాలేదు. దీన్ని కొంత సేపు నొప్పి ఉన్న చోట పెట్టాలి. దీంతో ఆ పెయిన్ నుంచి కాస్త ఉపశమనంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మృదువుగా మసాజ్ చేయాలి:

కండరాలు లేదా పిక్కలు పట్టేసినప్పుడు కొబ్బరి నూనె, ఆలీవ్ ఆయిల్, ఆవ నూనెను ఒక్కో స్పూన్ చొప్పన తీసుకుని లైట్ గా వేడి చేయాలి. దీన్ని కండరాలు, పిక్కలు పట్టేసిన చోట మృదువుగా మాసాజ్ చేయాలి. బిగుతుగా మారిన కండరాలు నూనె రాయడం వల్ల ఫ్రీ అవుతాయి. పెయిన్ తగ్గుతుంది.

నీరు తాగాలి:

సాధారణంగా కొంత మంది నీరు ఎక్కువగా తాగరు. ఇలాంటి వారు డీ హైడ్రేషన్ కు గురవుతారు. డీ హైడ్రేషన్ ఉన్న వారికి కూడా ఇలా కండరాలు, పిక్కలు పట్టేయడం జరుగుతూంటాయి. ఇలా పట్టేసినప్పుడు నీరు తాగాలి. దీంతో ఈ సమస్య నుంచి ఉపశనం లభిస్తుంది.

పోటాషియం తగ్గినప్పుడు:

బాడీలో సరైనంత పొటాషియం లేనప్పుడు కూడా పిక్కలు లేదా తొడ కండరాలు పడుతూంటాయి. ఈ సమస్యతో బాధ పడుతున్న వారు అరటి పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె – లవంగాలు:

ఇలా పిక్కలు పట్టేయడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. కాస్త కొబ్బరి నూనెలో కొన్ని లవంగాలు వేసి ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా వేడి చేసుకోవాలి. ఇలా వేడెక్కిన నూనెను నొప్పి ఉన్న ప్రాంతంలో రాయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది