Jeera weight loss drink: జీల కర్రని ఇలా తీసుకుంటే.. నాజూగ్గా తయారవుతారు!
వంట గదిలో ఉండే పోపుల పెట్టిలో ఉండే అద్భుతమైన వాటిల్లో జీల కర్ర కూడా ఒకటి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేలా వీటిని ఉపయోగిస్తారు. జీల కర్రతో ఎన్నో రకాల వ్యాధులకు, ఇన్ ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. జీల కర్రతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా, బరువును కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఆహార శైలి వలన అనేక జీర్ణ సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా అధిక..
వంట గదిలో ఉండే పోపుల పెట్టిలో ఉండే అద్భుతమైన వాటిల్లో జీల కర్ర కూడా ఒకటి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేలా వీటిని ఉపయోగిస్తారు. జీల కర్రతో ఎన్నో రకాల వ్యాధులకు, ఇన్ ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. జీల కర్రతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా, బరువును కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ఆహార శైలి వలన అనేక జీర్ణ సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా అధిక బరువు కారణంగా అనేక సమస్యలు పెరుగుతాయి. రక్త పోటు, డయాబెటీస్, కాలేయ సమస్యలు, శ్వాస తదితర ఎన్నో సమస్యలను ఎదురవుతాయి. కాబట్టి బరువును ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి. బరువును కంట్రోల్ లో ఉంచుకోవడానికి జీల కర్ర అద్భుతంగా పని చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ జీరా వాటర్ ను తాగితే సులభంగా వెయిల్ లాస్ అవ్వొచ్చు. మరి ఈ జీరా వాటర్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
జీల కర్ర వెయిట్ లాస్ డ్రింక్ తయారీ విధానం:
ఇంట్లోని కొన్ని రకాల పదార్థాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీల కర్ర వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత ఈ పొడిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో నీళ్లు, అల్లం తురుము వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా ఈ నీటిని ఐదు నిమిషాల పాటు మరిగించుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక గ్లాస్ లోకి వడకట్టుకోవాలి. ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు నిమ్మ రసం కలుపు కోవాలి. ఈ డ్రింక్ ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ డ్రింక్ తాగితే వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
జీరా వెయిట్ లాస్ డ్రింక్ తాగడం వల్ల కలిగే బెనిఫిట్స్:
1. బాడీలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ తొలగి పోతుంది. 2. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. 3. జలుబు, దగ్గు తగ్గుతాయి. 4. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 5. జీర్ణ సమస్యలు రావు. 6. కడుపులో మంట, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. 7. డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. 8. గుండె సమస్యలు తగ్గుతాయి. 9. కాలేయం క్లీన్ అవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.