Mutton Paya: మటన్ పాయాను ఈ స్టైల్లో చేస్తే.. వావ్ అనాల్సిందే!

మటన్ పాయా గురించి ప్రత్యేకంగా పరిచయాలు కానీ.. టేస్ట్ కానీ గురించి చెప్పాల్సిన పని లేదు. అంత టేస్టీగా ఉంటుంది మటన్ పాయ. అందులోనూ హైదరాబాద్ లో ఉన్నవారికి ఎక్కడెక్కడ మటన్ పాయ టేస్టీగా ఉంటుందో తెలుసు. మటన్ పాయకు పెట్టింది పేరు హైదరాబాద్. అందులోనూ రంజాన్ సీజన్ లో చార్మినార్ వద్ద మటన్ పాయ అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఈ మటన్ పాయాను ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఎలా చేసినా మొత్తానికి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పాయను..

Mutton Paya: మటన్ పాయాను ఈ స్టైల్లో చేస్తే.. వావ్ అనాల్సిందే!
Mutton Paya
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 15, 2023 | 7:08 PM

మటన్ పాయా గురించి ప్రత్యేకంగా పరిచయాలు కానీ.. టేస్ట్ కానీ గురించి చెప్పాల్సిన పని లేదు. అంత టేస్టీగా ఉంటుంది మటన్ పాయ. అందులోనూ హైదరాబాద్ లో ఉన్నవారికి ఎక్కడెక్కడ మటన్ పాయ టేస్టీగా ఉంటుందో తెలుసు. మటన్ పాయకు పెట్టింది పేరు హైదరాబాద్. అందులోనూ రంజాన్ సీజన్ లో చార్మినార్ వద్ద మటన్ పాయ అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఈ మటన్ పాయాను ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఎలా చేసినా మొత్తానికి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ పాయను తింటే ఇన్ ఫెక్షన్లకు, సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఎంత టేస్టీనో అంత ఆరోగ్యం కూడా. మటన్ పాయను రాగి సంగటి, అన్నం, చపాతీ, రోటీల్లో కూడా తినవచ్చు. మటన్ పాయ చేయడానికి కాస్త ప్రాసెస్ పడుతుంది. కానీ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ పాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

నూనె లేదా నెయ్యి, మటన్ కాళ్లు, పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, కారం, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, కొత్తిమీర.

ఇవి కూడా చదవండి

మసాలా పొడికి కావాల్సిన ఇంగ్రీడియన్స్:

జీల కర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు.

మటన్ పాయ కర్రీ తయారీ విధానం:

ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు పాయ పీసెస్ వేసి కలపాలి. ఇవి కాసేపు వేయించుకోవాలి. ఈలోపు ఒక పాన్ తీసుకుని అందులో జీల కర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు వేసి డ్రై రోస్ట్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ ను పక్కకు పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఇదే మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని మాత్రమే పాయలో వేసి కలుపుకోవాలి. కాసేపు వేగాక ఇందులో కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించుకుని నీళ్లు పోసి.. ఒక్క ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి.. 10 నుంచి 15 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరిపోయాక.. ఒకసారి ఉప్పు రుచి చూసుకుని.. కొత్తి మీర చల్లుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ గా ఉండే మటన్ పాయ సిద్ధం. మొదట కొంచెం ప్రాసెస్ గా ఉన్నా.. ఒక్కసారి చేస్తే ఈజీ అయిపోతుంది. మరింకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి మటన్ పాయను ట్రై చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!