Coconut Benefits and Side effects: కొబ్బరిని కూరల్లో వేస్తే మంచిదేనా.. కూరల్లో వేస్తే ఏమౌతుంది?
కొబ్బరిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి, స్కిన్ కి, హెయిర్ కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, కొబ్బరి వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కొబ్బరిని ఎక్కువగా కేరళ ప్రజలు ఉపయోగిస్తూంటారు. కూరల్లో, ఒంటి, బాడీకి కొబ్బరిని విరివిగా వాడతారు. అయితే కొబ్బరి నూనె కానీ.. కొబ్బరిని కూరల్లో వేయడం వల్ల మంచిది కాదని కొంత మంది భయపడతారు. మరి కూరల్లో కొబ్బరిని, కొబ్బరిని నూనె, పాలు వాడటం మంచిదేనా? కాదా? ఎలా వాడాలి? అన్న విషయాలను..
కొబ్బరిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి, స్కిన్ కి, హెయిర్ కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, కొబ్బరి వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కొబ్బరిని ఎక్కువగా కేరళ ప్రజలు ఉపయోగిస్తూంటారు. కూరల్లో, ఒంటి, బాడీకి కొబ్బరిని విరివిగా వాడతారు. అయితే కొబ్బరి నూనె కానీ.. కొబ్బరిని కూరల్లో వేయడం వల్ల మంచిది కాదని కొంత మంది భయపడతారు. మరి కూరల్లో కొబ్బరిని, కొబ్బరిని నూనె, పాలు వాడటం మంచిదేనా? కాదా? ఎలా వాడాలి? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కూరల్లో వేసుకోవచ్చా:
కొబ్బరిని కూరల్లో వేసుకోవచ్చు. అయితే కూరలతో పాటు ఫ్రై చేసి తినడం అంత మంచిది. కొబ్బరిని కూరల్లో ఉపయోగించాలంటే.. చివరిలో వేసుకుని జస్ట్ ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అయితే మనకు బెనిఫిట్స్ అందుతాయి. లేదంటే కొబ్బరిని వేడి చేసినప్పుడు అందులోని పాలీసైక్లిక్ హైడ్రో కార్బన్స్ ఏర్పడతాయి. అలాగే గ్యాస్, గుండెల్లో మంట, పేగు సమస్యలు, అసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి.
కొబ్బరి తురుము:
కొబ్బరి తురుము కూరల్లో వేస్తే ఎక్కువ సేపు వేడి చేయకూడదు. ఎక్కువగా వేడి చేయడం వల్ల వీటిల్లో ఉండే పోషకాలు తొందరగా పోయే ఛాన్స్ ఉంది. వీటిని కూరల్లో చేర్చడం వల్ల మంచి టేస్ట్ తో పాటు శక్తి కూడా లభిస్తుంది. వీటిల్లో సెలీనియం, మాంగనీస్, ఫైబర్, ఐరన్, క్యాల్షియం, విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా. అయితే వీటిల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువగా తీసుకోవాలి. లేదంటే బరువు పెరుగుతారు.
కొబ్బరి పాలు:
కొబ్బరి పాలను కూడా జ్యూస్ లలో, ఆహార పదార్థాల్లో ఉపయోగించవచ్చు. వీటిని ఆహారాలతో పాటు తీసుకుంటే హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే కొబ్బరి పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తింటే ఎక్కువగా ఆకలి వేస్తుంది. కాబట్టి తక్కువగా తీసుకోవడమే మంచిది.
ఆరోగ్యానికి మంచిదేనా:
కూరల్లో కొబ్బరిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కానీ.. మరీ ఎక్కువ సేపు వేయించకూడదు. కొబ్బరిని ఆహారాల్లో ఉపయోగించాలనుకుంటే.. కూరలను దించే ముందు తీసుకోవాలి. అలా అయితేనే హెల్దీ. లేదంటే దుష్ర్పభావాలను ఎదుర్కొనవలసి ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.