భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయడం మంచిదేనా?

Samatha

01  march 2026

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే చాలా మంది ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

ఆరోగ్యం

మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ కోసం తిన్న వెంటనే నడవడానికి ఆసక్తి చూపుతున్నారు.

బరువు తగ్గడం

చాలా మది తిన్న వెంటనే వాకింగ్ చేస్తుంటారు. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడం, చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి లేదా సోమరితనం నుంచి బయటపడటానికి నడుస్తుంటారు.

తిన్న వెంటనే వాకింగ్

అయితే తిన్న తర్వాత నడవడం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ,  ఇది అందరికీ ఆరోగ్యకరమైనది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

సమస్యలు

ఆర్ ఎంఎల్ ఆసుపత్రి వైద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి ప్రకారం , తిన్న వెంటనే వేగంగా నడవడం అస్సలే మంచిది కాదంట.

అతివేగం

భోజనం చేసిన తర్వాత శరీరంలోని రక్త ప్రవాహం జీర్ణక్రియ వైపు మళ్లించబడుతుంది. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

జీర్ణక్రియ

కానీ మీరు తిన్న వెంటనే వేగంగా నడవడం వలన ఇది కొన్ని సార్లు కడుపు నొప్పి, బరువు పెరగడం లేదా, ఆమ్లతత్వానికి కారణం అవుతుందంట.

కడుపు నొప్పి

అందువలన తిన్న తర్వాత కనీసం 10 నిమిషాలు చాలా తేలికగా , నెమ్మదిగా నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

స్లోగా నడవడం