AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D: విటమిన్‌ ‘డీ’ సస్లిమెంట్లను తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! లేదంటే కిడ్నీ, గుండె మటాష్..

మారుతున్న జీవనశైలి, సూర్యరశ్మికి గురికాకపోవడం, ఎక్కువసేపు ఇంట్లోనే ఉండటం వంటి కారణాల వల్ల చాలా మందిలో ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. అంతే కాదు ఇది రోగనిరోధక శక్తిని కూడా..

Vitamin D: విటమిన్‌ 'డీ' సస్లిమెంట్లను తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! లేదంటే కిడ్నీ, గుండె మటాష్..
Vitamin D Supplements
Srilakshmi C
|

Updated on: Mar 02, 2026 | 8:46 PM

Share

ఇటీవలి కాలంలో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకునే వారి సంఖ్య పెరిగింది. మారుతున్న జీవనశైలి, సూర్యరశ్మికి గురికాకపోవడం, ఎక్కువసేపు ఇంట్లోనే ఉండటం వంటి కారణాల వల్ల చాలా మందిలో ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది. అంతే కాదు ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కానీ ఈ విటమిన్‌ లోపం ఎముకల నొప్పి, అలసట, బలహీనత, తరచుగా అనారోగ్యం, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలకు దారితీస్తుంది. దీంతో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. కానీ వీటిని తీసుకునేముందు, కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. అప్పుడే శరీర అవసరాలకు అనుగుణంగా దానిని సరిగ్గా తీసుకోవచ్చు. లేకపోతే, దాని నుండి పూర్తి ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదు.

విటమిన్ డి సప్లిమెంట్‌ను పాలు లేదా నీళ్లు దీనితో కలిపి తీసుకోవడం మంచిది?

లేడీ హార్డింగ్ హాస్పిటల్ డైరెక్టర్, వైద్య విభాగం అధిపతి డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్ మాట్లాడుతూ.. పాలలో కొవ్వు, కాల్షియం రెండూ ఉంటాయి కాబట్టి, చాలా మంది పాలతో పాటు తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది పాలు తాగడానికి ఇష్టపడరు. లాక్టోస్ అలెర్జీ ఉంటే ఇలాంటి వాళ్లు నీటితో తీసుకోవచ్చు. కానీ వీరు భోజనంతో పాటు కొన్ని అధిక కొవ్వు పదార్ధాలను తినడం మర్చిపోకూడదు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సప్లిమెంట్‌ను క్రమం తప్పకుండా, వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. తద్వారా శరీరానికి పూర్తి ప్రయోజనం లభిస్తుంది.

విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడానికి సరైన సమయం ఏది?

సాధారణంగా ఉదయం లేదా మధ్యాహ్న భోజనంలో విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ సమయంలో జీర్ణక్రియ చురుకుగా ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కొంతమందికి అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటు 15-20 నిమిషాలు ఎండలో కూర్చోవడం కూడా చాలా ముఖ్యం. కానీ ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండా ఎక్కువ కాలం విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది కాదు. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయి పెరుగుతుంది. ఇది మూత్రపిండాలు, గుండెను ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఏపీ రైతులకు భారీ శుభవార్త.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు
ఏపీ రైతులకు భారీ శుభవార్త.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు
వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!
వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!
ఈ ఆలయాన్ని దర్శిస్తే.. నాగసర్ప, కుజ దోషాలు తొలిగి కళ్యాణం, సంతానం
ఈ ఆలయాన్ని దర్శిస్తే.. నాగసర్ప, కుజ దోషాలు తొలిగి కళ్యాణం, సంతానం
రూమర్స్ పై రష్మిక రియాక్షన్..
రూమర్స్ పై రష్మిక రియాక్షన్..
జస్ట్ ఒక్క మిస్డ్ కాల్‌తో ఇంటికే సిలిండర్.. ఇవి పక్కా తెలుసుకోండి
జస్ట్ ఒక్క మిస్డ్ కాల్‌తో ఇంటికే సిలిండర్.. ఇవి పక్కా తెలుసుకోండి
చాలామందికి తెలియని నిజం!గ్యాస్ సిలిండర్ గుండ్రంగా ఎందుకు ఉంటుంది?
చాలామందికి తెలియని నిజం!గ్యాస్ సిలిండర్ గుండ్రంగా ఎందుకు ఉంటుంది?
13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు
13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు
ఏపీలో ప్రతీఒక్కరికీ స్మార్ట్ కార్డ్.. స్కాన్ చేస్తే చాలు..
ఏపీలో ప్రతీఒక్కరికీ స్మార్ట్ కార్డ్.. స్కాన్ చేస్తే చాలు..
ఫాదర్ మొమెంట్‌..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!
ఫాదర్ మొమెంట్‌..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!
బైక్ మైలేజ్ తగ్గిందా.. ఇలా చేస్తే చాలు కిలోమీటర్లు పెరగడం పక్కా..
బైక్ మైలేజ్ తగ్గిందా.. ఇలా చేస్తే చాలు కిలోమీటర్లు పెరగడం పక్కా..