Navratri 2023: హార్ట్ పేషంట్స్ ఉపవాసం ఉండొచ్చా? ఈ సమయంలో గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే!

వినాయక చవితి నవరాత్రులు వెళ్లిపోయాయి.. ఇప్పుడు దసరా నవరాత్రులు వచ్చేశాయి. అలాగే బతుకమ్మను కూడా చేస్తారు. వినాయక చవితిని ఎలా ఎంత ఆర్భాటంగా చేస్తారో.. అంతే విధంగా దసరా నవరాత్రులు కూడా చేస్తారు. ఈ నవరాత్రి సమయంలో ఏ గుడి చూసినా మహిళలతో కిటకిట లాడుతూ ఉంటుంది. కుంకుమ పూజలు, బతుకమ్మ ఆటలతో సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ సమయంలో హార్ట్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య..

Navratri 2023: హార్ట్ పేషంట్స్ ఉపవాసం ఉండొచ్చా? ఈ సమయంలో గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే!
Heart Attack
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 15, 2023 | 9:57 PM

వినాయక చవితి నవరాత్రులు వెళ్లిపోయాయి.. ఇప్పుడు దసరా నవరాత్రులు వచ్చేశాయి. అలాగే బతుకమ్మను కూడా చేస్తారు. వినాయక చవితిని ఎలా ఎంత ఆర్భాటంగా చేస్తారో.. అంతే విధంగా దసరా నవరాత్రులు కూడా చేస్తారు. ఈ నవరాత్రి సమయంలో ఏ గుడి చూసినా మహిళలతో కిటకిట లాడుతూ ఉంటుంది. కుంకుమ పూజలు, బతుకమ్మ ఆటలతో సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ సమయంలో హార్ట్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నవరాత్రి సమయంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే ఇలా ఉపవాసం ఉండటం వల్ల గుండె సమస్యలు ఎక్కువ అవుతాయన్న విషయం మీకు తెలుసా? అందులో గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు దీని దూరంగా ఉండాలి.

వివిధ వ్యాధులకు గురవ్వాల్సి వస్తుంది:

ఉపవాసం ఉండటం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. రక్త పోటు తగ్గుతుంది. హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. ఉపవాస సమయంలో సాధారణమైన భోజనం మానేయడం వల్ల డీ హైడ్రేషన్ కు గురవుతారు. దీని వల్ల గుండె సమస్యలు తీవ్ర తరం అవుతాయి. గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఉపవాసం అస్సలు ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహార విషయాల్లో ఆకస్మికంగా మార్పులు రావడం వల్ల శరీరంలో అనే మార్పులు చేర్పులు జరుగుతాయి. గుండెల్లో మంట, కడుపులో మంట, నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, జీర్ణ సమస్యలు, డీ హైడ్రేషన్ కు గురి కావడం, రోగ నిరోధక శక్తి తగ్గడం ఇలా అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కాబట్టి ఉపవాసం ఉండి కొన్ని రకాలైన ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె పలు రకాల ఇబ్బందులకు గురి అవుతుంది. రక్త ప్రసరణలో మార్పులు, సోడియం స్థాయిలలో చేంజ్ కారణంగా హృదయ నాళ వ్యవస్థను దెబ్బ తీస్తాయి. దీంతో గుండె లయలో మార్పులు వస్తాయి. ఈ ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఒక వేళ గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఉపవాసం ఉండాలనుకుంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. వీటి వల్ల సమస్యలు కాస్త తగ్గించుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం.

హార్ట్ పేషంట్స్ ఉపవాసం ఉండాలంటే చిట్కాలు:

1. కొన్ని రకాల జ్యూస్ లు లేదా మజ్జిగ, నీరు, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి.

2. పండ్లు, కూరగాయలు, గింజలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని కలిగి ఉన్న సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీని వల్ల శక్తి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

3. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించడంలో సహాయ పడతాయి. బ్లడ్ లో షుగర్ లెవల్స్ కూడా పెరగవు.

4. తేలిక పాటి వ్యాయామాలు చేయాలి. ఇవి ఎనర్జీ లెవల్స్ ను నిర్వహించడంలో హెల్ప్ చేస్తాయి. ఉపవాస సమయంలో తీవ్రమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు