Evening Workouts: వ్యాయామం ఉదయం కంటే సాయంత్రం చేస్తేనే మంచిదా?
వ్యాయామం ఉదయం చేయాలా? లేక సాయంత్రం చేయాలా? ఏ సమయంలో చేస్తే మంచిది. ఇలాంటి డౌట్స్ చాలా మందికి వచ్చే ఉంటాయి. ఉదయం చేయడం వల్ల మంచిదని కొందరు ఫిట్ నెస్ నిపుణులు చెప్తుంటే.. మరికొందరు సాయంత్రం చేయడం బెటర్ అంటున్నారు. కానీ వ్యాయామం చేయడానికి రెండు సమయం మంచివే. అయితే కొందరు సమయం కుదిరినప్పుడు ఉదయం లేదా సాయంత్రం చేస్తూంటారు. ఇప్పటికే ఉదయం వ్యాయామాలు చేయడం వల్ల కలిగే లాభాల..
వ్యాయామం ఉదయం చేయాలా? లేక సాయంత్రం చేయాలా? ఏ సమయంలో చేస్తే మంచిది. ఇలాంటి డౌట్స్ చాలా మందికి వచ్చే ఉంటాయి. ఉదయం చేయడం వల్ల మంచిదని కొందరు ఫిట్ నెస్ నిపుణులు చెప్తుంటే.. మరికొందరు సాయంత్రం చేయడం బెటర్ అంటున్నారు. కానీ వ్యాయామం చేయడానికి రెండు సమయం మంచివే. అయితే కొందరు సమయం కుదిరినప్పుడు ఉదయం లేదా సాయంత్రం చేస్తూంటారు. ఇప్పటికే ఉదయం వ్యాయామాలు చేయడం వల్ల కలిగే లాభాల గురించి మనం తెలుసుకునే ఉంటాం. ఇప్పుడు సాయంత్రం చేయడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి తగ్గించుకోవచ్చు:
సాయంత్రం ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఒత్తిడి నుంచి రిలీఫ్ నెస్ దొరుకుతుంది. ఉదయం అంతా ఉరుకులు పరుగులతో బిజీగా ఉన్న వారికి సాయంత్రం ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఆందోళన, నిరాశ వంటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. అంతే కాకుండా మంచి నిద్ర కూడా పడుతుంది. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఎక్కువ సమయం కేటాయిస్తారు:
ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా ఉదయం వ్యాయామాలు చేయాలంటే కొందరికి సరైన సమయం దొరకదు. అలాంటి వారు సాయంత్రం రిలాక్స్ గా వ్యాయామం చేసుకోవచ్చు. దీంతో ఆఫీసుల నుంచి వచ్చాక ఎక్సర్ సైజ్ ల ప దృష్టి సారించవచ్చు. ఇంకా ఎక్కువ సమయం కేటాయించవచ్చు.
బరువు తగ్గొచ్చు:
సాయంత్రం ఎక్సర్ సైజ్ చేయడం వల్ల మగవారికి బాగా మేలు చేస్తుంది. సాయంత్రం రిలాక్స్ గా వ్యాయామం చేస్తారు కాబట్టి.. ఫోకస్ అంతా దీనిపైనే ఉంటుంది. దీంతో కొవ్వును కరిగించుకోవడంలో మరింత సమయాన్ని గడపవచ్చు. దీని వల్ల పొట్ట, పొత్తి కడుపు, నడుము, తొడ భాగాల్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. దీని వల్ల ఈజీగా వెయిల్ లాస్ అవ్వొచ్చు.
కండరాల్లో సడలింపు:
ఉదయం నుంచి పని చేయడం వల్ల కండరాలు అనేవి గట్టిగా మారతాయి. కాబట్టి సాయంత్రం సమయంలో ఎక్సర్ సైజ్ చేయడం వల్ల టెన్షన్ ను దూరం చేసుకోవచ్చు. అంతే కాకుండా బాడీ రిలాక్స్ గా తేలికగా ఫీల్ అవుతుంది. సాయంత్రం మితమైన వ్యాయామం చేయడం వల్ల కండరాలకు కూడా రిలీఫ్ గా ఉంటుంది. దీంతో శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.