AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips for Sugar Levels: రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు వీటిని పాటిస్తే.. సూపర్ రిజల్ట్స్ మీ సొంతం!

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందర్నీ డయాబెటీస్ సమస్య వేధిస్తోంది. దీంతో ఏ ఆహారం తిన్నాలన్నా వారు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కారణం.. ఏం తిన్నా బ్లడ్ లో షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరిపోతాయి. కానీ ఒకవైపు ఆకలి మాత్రం వేస్తూ ఉంటుంది. దీంతో తర్జన భర్జన పడుతూ ఉంటారు. మందులు వేసుకుంటున్నాం కదా పర్వాలేదని మరి కొందరు ఏది పడితే అవి లాగించేస్తారు. దీంతో ఆ తర్వాత ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధి..

Tips for Sugar Levels: రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు వీటిని పాటిస్తే.. సూపర్ రిజల్ట్స్ మీ సొంతం!
Blood Sugar Levels
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 14, 2023 | 6:29 PM

Share

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందర్నీ డయాబెటీస్ సమస్య వేధిస్తోంది. దీంతో ఏ ఆహారం తిన్నాలన్నా వారు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కారణం.. ఏం తిన్నా బ్లడ్ లో షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరిపోతాయి. కానీ ఒకవైపు ఆకలి మాత్రం వేస్తూ ఉంటుంది. దీంతో తర్జన భర్జన పడుతూ ఉంటారు. మందులు వేసుకుంటున్నాం కదా పర్వాలేదని మరి కొందరు ఏది పడితే అవి లాగించేస్తారు. దీంతో ఆ తర్వాత ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధి అనేది ఒక్కసారి వచ్చిందంటే అంత త్వరగా పోదు. దాన్ని మనమే కంట్రోల్ లో ఉంచాలి. తిన్న తర్వాత బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు కొన్ని రకాల చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని పాటిస్తే మాత్రం.. చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపు చేయవచ్చు.

పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి:

మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫైబర్ ఒక రకమైన కార్బోహైడ్రేట్ కాబ్టి.. ఇతి త్వరగా బాడీలో కరగదు. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే చక్కెర ఉత్పత్తిని తక్కువ చేస్తుంది. కాబట్టి మీరు తిన్న తర్వాత కూడా షుగర్ లెవల్స్ పెరగవు.

ఇవి కూడా చదవండి

ఒక్కటేసారి ఎక్కువ మొత్తం ఆహారం తీసుకోకూడదు:

ఆకలి వేస్తుందని చాలా మంది ఒక్కటేసారి ఎక్కువ మొత్తంలో తినేస్తారు. కానీ ఇది చాలా తప్పు. అలా తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి ఒక్కటే సారి కాకుండా.. కొంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే.. కడుపు నిండిన భావన కలుగుతుంది.

తిన్న వెంటనే పడుకోకూడదు:

మధు మేహంతో బాధ పడేవారైనా లేక డయాబెటీస్ లేని వారైనా తిన్న వెంటనే నిద్ర పోకూడదు. దీని వల్ల కూడా షుగర్ లెవల్స్ అనేవి పెరిగిపోతాయి. అలాగే బరువు కూడా పెరుగుతారు.

బ్రేక్ ఫాస్ట్ అస్సలు మిస్ చేయకూడదు:

ఉదయం స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లే హడావిడిలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మధు మేహం వచ్చే అవకాశం ఉంది. ఉదయం అల్పాహారం తినకపోతే.. మీ రక్తంలో షుగర్ లెవల్స్ అనేది వేగంగా పెరుగుతాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు. అలాగే మీ టిఫిన్ లో ప్రోటీన్, ఫైడర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవలి.

నిద్ర:

నిద్ర వల్ల కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిలో షుగర్ కూడా ఒకటి. సరైన నిద్ర లేకపోతే షుగర్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలు అధ్యయానలు తేల్చి చెప్పాయి. కాబట్టి నాణ్యమైన నిద్ర అవసరం.

గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి:

మీకు డయాబెటీస్ వచ్చే సూచనలు ఉన్నా లేక మధు మేహంతో ఇబ్బంది పడుతున్న వారైనా బ్లడ్ లో చక్కెర స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటి లెవల్స్ బట్టి మీ ఆహారంలో చేర్పులు, మార్పులు చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.