Vastu Tips: వంట గదిలో ఈ వాస్తు చిట్కాలు అనుసరించండి.. డబ్బుకు కొరత ఉండదు!

ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండాలంటే వంటగదే ముఖ్య కారణం. ఎందుకంటే అక్కడే ఆహార పదార్థాల తయారీ కానీ, నిల్వ కానీ ఉంటుంది. వీటిల్లో ఏదైనా తారుమారు అయితే.. మన ఆరోగ్యాలు కూడా తారుమారవుతాయి. కాబట్టి వంట గదిని శుభ్రంగా ఉంచుకోవడమే కాదు.. ఏ వస్తువు ఎక్కడ ఉంచితే బెటర్ సెట్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి చెబుతూంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే వంట గదిలో లక్ష్మీ దేవితో పాటు..

Vastu Tips: వంట గదిలో ఈ వాస్తు చిట్కాలు అనుసరించండి.. డబ్బుకు కొరత ఉండదు!
Kitchen
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 14, 2023 | 6:18 PM

ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండాలంటే వంటగదే ముఖ్య కారణం. ఎందుకంటే అక్కడే ఆహార పదార్థాల తయారీ కానీ, నిల్వ కానీ ఉంటుంది. వీటిల్లో ఏదైనా తారుమారు అయితే.. మన ఆరోగ్యాలు కూడా తారుమారవుతాయి. కాబట్టి వంట గదిని శుభ్రంగా ఉంచుకోవడమే కాదు.. ఏ వస్తువు ఎక్కడ ఉంచితే బెటర్ సెట్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి చెబుతూంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే వంట గదిలో లక్ష్మీ దేవితో పాటు అన్నపూర్ణ మాత కూడా ఉంటుంది. ఆ ఆది శివుడికే అన్నం పెట్టిన లోక మాత.. అన్నపూర్ణా దేవి. కాబట్టి అన్నానికి ఎప్పుడూ వాల్యూ ఇవ్వండి. ఈ విషయం అటుంచితే.. సాధారణ గదుల లాగా కాకుండా.. వంట గదిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో ఎప్పుడూ ధనం, ధాన్యం కొరత ఉండకూడదంటే.. ఈ వాస్తు టిప్స్ ని ఫాలో అయి చూడండి. మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందం వెల్లివిరుస్తుంది. మరి ఇంకెందుకు లేట్ ఆ టిప్స్ ఏంటో చూసేద్దాం.

వంట గదిలో ఈ రంగు అస్సలు ఉండకూదు:

చాలా మంది లేడీస్ వంట గదిలో కూడా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. వంట గది నీట్ గా, క్లీన్ ఉండేలా సెల్ చేసుకుంటారు. ఇందుకు తగ్గట్టుగానే మంచి కలర్ ఫుల్ పెయింటింగ్స్ కూడా వేయిస్తారు. అయితే వంట గది వాస్తు ప్రకారం.. కిచెన్ లో కొన్ని రకాల రంగులు అస్సలు వేయకూడదు. వంటగదిలో రంగులు వేసే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలా మంది డార్క్ కలర్స్ అంటే ఎరుపు, ముదురు రంగులు వేస్తూంటారు. అలాగే బ్లాక్, గోధుమ రంగు కూడా వేయకూడదు. లెమన్ ఎల్లో లేదా పేస్టెల్ గ్రీన్ వంటి వాటిని ఎంచుకోవచ్చు. వీటి వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతా వరణం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టాయిలెట్ పైన వంటగది ఉండకూడదు:

ధాన్యం కూడా దేవుడితో సమానం. కొంత మంది తెలియక ప్రస్తుత కాలంలో టాయిలెట్ పై వంట గదిని కడుతున్నారు. ఇలా అస్సలు చేయకూడదు.

మీ ముందు స్పూన్లు, కత్తులు ఉంచుకోకూడదు:

వంట గదిలో స్పూన్లు కానీ, వెజిటేబుల్స్ కట్ చేసే చాక్స్ చాలా అవసరం. దీంతో వీటిని అందుబాటులో ఉండేలా చూసుకుంటారు గృహిణులు. అయితే పని చేసేటప్పుడు మీ ముందు కత్తులు, స్పూన్లు ఉండ కుండా చూసుకోండి. పక్కకు ఉన్నా పర్వాలేదు.

పాత్రలను ఈ దిశలో పెట్టుకోవాలి:

చాలా మంది కిచెన్ లో వస్తువులను ఎక్కడ పడితే అక్కడ సర్దేస్తారు. అలా కాకుండా పాత్రలను వెస్ట్ లేదా సౌత్ వెస్ట్ దిశలో ఉంచుకోవాలి.

ఫ్రిజ్, మిక్సీ వంటికి ఇక్కడ పెట్టండి:

వంటగదిలో ముఖ్యమైన వస్తువుల్లో మిక్సీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ లు ఒకటి. వీటిని ఉంచడానికి సరైన ప్లేసులు కూడా ఉన్నాయి. మిక్సీని సౌత్ ఈస్ట్ జోన్ లో, ఫ్రిజ్ ను నార్త్ వెస్ట్ జోన్ లో ఉంచుకోవాలి. అవసరమైతే కిచెన్ లోపల.. నార్త్ వెస్ట్ జోన్ లో ఫ్రిజ్ ను ఉంచవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.