Chicken Soup: చికెన్ సూప్ ను ఇలా చేసి తాగండి.. జలుబు, దగ్గు అన్నీ దెబ్బకు పరార్!

రెస్టారెంట్లు, హోటల్స్ లో ఎక్కువగా లభించే వాటిల్లో చికెన్ సూప్ కూడా ఒకటి. ఇది ఎంతో టేస్టీతో పాటు హెల్దీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సూప్ ను ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్ టేస్ట్ తో పాటు ఇంట్లో చేసుకుంటాం కాబట్టి నీటిగా కూడా ఉంటుంది. జ్వరంగా ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించనప్పుడు ఇలాంటివి చేసుకుని తాగితే బావుంటుంది. కాస్త నీరసం కూడా తగ్గుతుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, కఫం బాగా పట్టినప్పుడు చికెన్ సూప్ చేసుకుని..

Chicken Soup: చికెన్ సూప్ ను ఇలా చేసి తాగండి.. జలుబు, దగ్గు అన్నీ దెబ్బకు పరార్!
Chicken Soup
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 14, 2023 | 6:17 PM

రెస్టారెంట్లు, హోటల్స్ లో ఎక్కువగా లభించే వాటిల్లో చికెన్ సూప్ కూడా ఒకటి. ఇది ఎంతో టేస్టీతో పాటు హెల్దీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సూప్ ను ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్ టేస్ట్ తో పాటు ఇంట్లో చేసుకుంటాం కాబట్టి నీటిగా కూడా ఉంటుంది. జ్వరంగా ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించనప్పుడు ఇలాంటివి చేసుకుని తాగితే బావుంటుంది. కాస్త నీరసం కూడా తగ్గుతుంది. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, కఫం బాగా పట్టినప్పుడు చికెన్ సూప్ చేసుకుని తాగితే దెబ్బకు పరార్ అవుతాయి. ఇంట్లో చికెన్ సూప్ చేసుకుని తాడం కూడా ఈజీనే. మొదట కాస్త కష్టమనిపించినా.. ఆ తర్వాత సింపుల్ గా చేసేసుకోవచ్చు. మరి ఈ చికెన్ సూప్ కు కావాల్సిన పదార్థలు ఏంటి? తయారు చేయు విధానం ఇప్పుడు చూసేద్దాం.

చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు:

చికెన్ బోన్ లెస్ (కావాలనుకున్న వారు బోన్స్ తో కూడా తీసుకోవచ్చు) 150 గ్రాములు , నెయ్యి లేదా నూనె – కొద్దిగా , సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 1, స్ప్రింగ్ ఆనియన్స్ – కొద్దిగా, కొత్తి మీర – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – కొద్దిగా, ఉప్పు – సరిపడినంత, మిరియాల పొడి – కొద్దిగా, సోయా సాస్ – కొద్దిగా, టమాటా సాస్ – కొద్దిగా, చిల్లీ సాస్ – కొద్దిగా, వెనిగర్ – కొద్దిగా, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, కోడి గుడ్డు – 1,

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకుని కాస్త నూనె వేసుకుని చికెన్ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. లోపల అంతా ఉడికేలా మధ్యస్థ మంటపై రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఆ తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని కాస్త చల్లారనివ్వాలి. నెక్ట్స్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పక్కకు పెట్టుకోవాలి. నెక్ట్స్ మళ్లీ కడాయి వేడి చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి లేదా నూనె కొద్దిగా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, ఉప్పు వేసి పెద్ద మంటపై బాగా వేయించుకోవాలి.

ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ ముక్కలకు బాగా పట్టాక.. నీళ్లే వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి నీళ్లు బాగా మరిగించాలి. నీరు మరిగిన తర్వాత మిరియాల పొడి, వెనిగర్, టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. ఈ నీటిని మరో మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఈ లోపు మరో గిన్నెలో ఎగ్ ని చితకకొట్టి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సూప్ లో వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్ కూడా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ సూప్ రెడీ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ చికెన్ సూప్ సిద్ధం అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో