Healthy Food Alert: హెల్దీ ఫుడ్ అని వాటిని కొని తింటున్నారా జాగ్రత్త..! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

చాలామంది చిరుతిళ్లు ఎక్కువ తినే అలవాటుతో ఉంటారు. అయితే, చిరుతిళ్ళు తినడం కదా అని ఏది పడితే అది తినేయరు. హెల్దీ ఫుడ్ లేబుల్ కనిపిస్తేనే ఆ ఫుడ్ కొంటారు. ఏది కొనాలన్నా.. సరే హెల్దీ ఫుడ్ లేబుల్ తో వచ్చిన ప్యాక్ లనే చూస్తారు. ఆఖరికి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా సరే హెల్దీ అయినది అని రాసి ఉంటేనే కొంటారు.. తింటారు.

Healthy Food Alert: హెల్దీ ఫుడ్ అని వాటిని కొని తింటున్నారా జాగ్రత్త..! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Representative Image
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 14, 2023 | 3:03 PM

ఆరోగ్యమే మహా భాగ్యం. ఇది అందరికీ తెలిసిందే. అందుకే ఆరోగ్యంగా ఉండడం కోసం అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందులోనూ చాలామంది ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కోసారి వీరి జాగ్రత్తలు ఎలా ఉంటాయి అంటే కచ్చితంగా ఆరోగ్యకరమైనది అని నిర్ధారణ కాకపొతే ఆకలితోనైనా ఉంటారు కానీ.. ఆ ఫుడ్ మాత్రం తీసుకోరు. ఇక చాలామంది చిరుతిళ్లు ఎక్కువ తినే అలవాటుతో ఉంటారు. అయితే, చిరుతిళ్ళు తినడం కదా అని ఏది పడితే అది తినేయరు. హెల్దీ ఫుడ్ లేబుల్ కనిపిస్తేనే ఆ ఫుడ్ కొంటారు. ఏది కొనాలన్నా.. సరే హెల్దీ ఫుడ్ లేబుల్ తో వచ్చిన ప్యాక్ లనే చూస్తారు. ఆఖరికి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా సరే హెల్దీ అయినది అని రాసి ఉంటేనే కొంటారు.. తింటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఇటీవల కాలంలో ప్రజల్లో పెరిగిన ఈ ఆరోగ్య చైతన్యాన్ని చాలా కంపెనీలు క్యాచ్ చేసుకుంటున్నాయి. హెల్దీ ఫుడ్ లేబుల్ వేస్తున్నాయి. దీంతో అది చూసి ప్రజలు వాటిని కొనుక్కుని తింటున్నారు. కానీ, వాస్తవానికి హెల్దీ ఫుడ్ లేబుల్ తో వచ్చే అన్నిటిలోనూ హెల్దీ మెటీరియల్ ఉంటుందా? ఇది చెప్పడం చాలా కష్టం. మరి లేబుల్ చూసి కొన్నాకా.. అందులో ఆరోగ్యకరమైన పదార్ధాలు ఉన్నాయని నిర్ధరించడం ఎలా? ఇది పెద్ద ప్రశ్న

ఉదాహరణకు ఇటీవల ఓట్స్ బిస్కెట్స్ అని ప్రచారం చేసి బిస్కెట్ ప్యాకెట్స్ వస్తున్నాయి. ఓట్స్ ఆరోగ్యానికి మంచిది. బరువు పెరగకుండా పోషకాలు అందిస్తాయి అని అందరూ నమ్ముతారు. సరిగ్గా ఇదే నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని కంపెనీలు ఓట్స్ పేరుతొ ప్రచారం చేస్తున్నాయి. నిజానికి ఈ బిస్కెట్స్ లో కేవలం 10 శాతం మాత్రమే ఓట్స్ ఉంటాయి. మిగిలినది అంతా మైదా పిండే ఉంటుంది. చాలా వరకు ఫుడ్ ప్రోడక్ట్స్ ఆరోగ్యకరమైనవిగా చెబుతుంటారు. కానీ నిజానికి అలా ఉండవు. కొన్ని ప్రోడక్ట్స్ అధిక ఫైబర్ కలిగి ఉన్నాయని ప్రచారం చేస్తూ మనల్ని ఆకర్షిస్తాయి. ఇందులో ఒమేగా 3 ఉందని కొన్ని ప్రోడక్ట్స్ చెబుతాయి. హెల్దీ ప్రోడక్ట్స్ అని చెప్పుకునే ఇవి సాధారణ ప్రోడక్ట్స్ కంటే రెండు లేదా మూడు రెట్లు ఖరీదైనవిగా ఉటాయి. తక్కువ చక్కెర, ఉప్పు, కొవ్వు – క్యాలరీ వివరాలు రేపర్ వెనుక భాగంలో ప్రింట్ అయి ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ బజ్రా, క్వినోవా, ఓట్స్ వంటి ఫ్యాన్సీ పేర్లను ప్రింట్ చేస్తాయి కానీ నిజంగా తగినంత పరిమాణంలో అవి ఉండవు.

అందుకే ఏదైనా హెల్దీ ఫుడ్ అని కొనేటప్పుడు అందులో ఉన్నాయని చెబుతున్నఆరోగ్యకరమైన పదార్ధాలు ఏ మోతాదులో ఉన్నాయో చెక్ చేసుకోవడం అవసరం. ప్రతి ప్రోడక్ట్ పై అందులో వాడి పదార్ధాలు.. ఎంత మోతాదులో వాడారు అనే విషయాన్ని లేబుల్ వెనుక భాగంలో ముద్రిస్తారు. దానిని చెక్ చేసి ఆ ప్రోడక్ట్ లో పేర్కొన్న పదార్ధాలు మీ ఆరోగ్యానికిభంగం కలిగించవు అని నిర్ధారించుకుని ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలి.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే FSSAI భారతదేశంలో ఆహారం – పానీయాల వస్తువులను నియంత్రిస్తుంది. ఆహార భద్రతపై కూడా అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. అయినప్పటికీ, అటువంటి ఉత్పత్తులు నిర్లక్ష్యంగా మార్కెట్ అవుతున్నాయి. ఖరీదైన వస్తువులు చాలా ఆరోగ్యకరమైనవి అని ప్రకటించి అమ్మేస్తున్నారు. FSSAI గత ఏడాది ఈ ఉత్పత్తులు ఎంత ఆరోగ్యకరమో వినియోగదారులకు తెలియజేయడానికి రేటింగ్ తీసుకురావాలని ప్రతిపాదించింది. కంపెనీలు ఉప్పు, చక్కెర – కొవ్వు పరిమాణం ఆధారంగా 1 నుంచి 5 స్కేల్‌లో అటువంటి ఉత్పత్తులను రేట్ చేస్తాయి. మీరు ఈ రేటింగ్‌ను ప్రోడక్ట్ ప్యాక్ పై చూడవచ్చు. అయితే, ఇంకా ఈ రేటింగ్ ఎప్పటి నుంచి వస్తుంది అనే స్పష్టత లేదు. త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తారని భావిస్తున్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే వినియోగదారులకు చాలా మేలు జరుగుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్