Vitamin D Overdose: విటమిన్ డి సప్లిమెంట్స్ ని తీసుకుంటున్నారా.. అయితే చాలా డేంజర్!

విటమిన్ డి.. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్ లో ఇది కూడా ఒకటి. ఎముకలు, దంతాల బలంగా, దృఢంగా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. అలాగే గాయాలను త్వరగా నయం చేయడంలో, బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ పెంచడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. భారత దేశంలో ప్రస్తుతం 76 శాతం విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ పోషకం లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా..

Vitamin D Overdose: విటమిన్ డి సప్లిమెంట్స్ ని తీసుకుంటున్నారా.. అయితే చాలా డేంజర్!
Vitamin D
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 14, 2023 | 6:15 PM

విటమిన్ డి.. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్ లో ఇది కూడా ఒకటి. ఎముకలు, దంతాల బలంగా, దృఢంగా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. అలాగే గాయాలను త్వరగా నయం చేయడంలో, బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ పెంచడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. భారత దేశంలో ప్రస్తుతం 76 శాతం విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ పోషకం లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విటమిన్ డీ సప్లిమెంట్స్ ని తీసుకుంటున్నారు. ఇవి కాస్తా దీర్ఘకాలంలో తీవ్రమైన దుష్ర్పభావాలకు దారి తీస్తుంది.

సూర్య రశ్మి ద్వారా కావాల్సినంత విటమిన్ డి అందుతుంది:

అంతే కాదు విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తిన్నా కూడా లేని పోని సమస్యలతు తలెత్తుతాయి. సూర్య రశ్మి ద్వారా విటమిన్ డి శరీరానికి కావాల్సినంత అందుతుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సూర్య రశ్మి చాలా అవసరం. ఉదయం కాసేపు ఎండలో కూర్చున్నా, పనులు చేసినా మనకు బాడీకి కావాల్సినంత సూర్య రశ్మి అందుతుంది. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా.. డిప్రెషన్ వంటి మానసిక సమస్యల నుంచి కూడా దూరం కావచ్చు.

ఇవి కూడా చదవండి

విటమిన్ డి లోపం వల్ల అంగ వైకల్యాలు త్వరగా ఏర్పడే అవకాశం:

వైద్యుల ప్రకారం.. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనంగా తయారవుతాయి. దీంతో అంగ వైకల్యాలు త్వరగా ఏర్పడే అవకాశం ఉంది. సూర్య రశ్మిలో ఉండటం వల్ల విటమిన్ డి స్వయంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే పుట్టగొడుగులు వంటి ఆహారం కూడా తీసుకుంటూ ఉండాలి. విటమిన్ డి శరీరంలో ఎక్కువ అయితే ఎదుర్కొనే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ డి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్:

1. కాల్షియం నిర్మాణం 2. వాంతులు అవుతాయి 3. వికారం 4. ఆకలి లేకపోవడం 5. డీహైడ్రేషన్ 6. విపరీతమైన దాహం 7. మూత్ర విసర్జన 8. మూత్ర పిండాల్లో రాళ్లు 9. శరీరంలో నొప్పులు 10. కిడ్నీ ఫెయిల్ 11. క్రమ రహితమైన హృదయ స్పందన 12. డెత్

విటమిన్ డి లోపం ఉంటే ఈ ఆహారాలు తీసుకోవచ్చు:

1. గుడ్లు 2. పాలు 3. రెడ్ మీట్ 4. పుట్ట గొడుగులు 5. కొవ్వు ఉన్న చేప

ఇలాంటి ఆహారలు తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయవచ్చు. కానీ నేరుగా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోకూడదు. డాక్టర్ని సంప్రదించాకే సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. లేకపోతే ప్రాణానికే ప్రమాదం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.