AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamarind Benefits: హార్ట్ రిస్క్ ను తగ్గించే చింతపండు.. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!

చింత పండు గురించి ప్రత్యేకంగా పరిచాలు అవసరం లేదు. ప్రతి వంట గదిలో ఈ చింత పండు అనేది ఉంటూనే ఉంటుంది. చింత పండుతో అనే రకాలైన వంటలను చేస్తూంటారు. చట్నీ, రసం, సాంబార్.. ముఖ్యంగా చింత పండు పులిహోర అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా వంటకాల్లో చింత పండును ఆహారం ఉపయోగిస్తారు. చింత పండుతో రుచే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింత పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. గుండె..

Tamarind Benefits: హార్ట్ రిస్క్ ను తగ్గించే చింతపండు.. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!
Chinthapandu
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 12, 2023 | 9:48 PM

Share

చింత పండు గురించి ప్రత్యేకంగా పరిచాలు అవసరం లేదు. ప్రతి వంట గదిలో ఈ చింత పండు అనేది ఉంటూనే ఉంటుంది. చింత పండుతో అనే రకాలైన వంటలను చేస్తూంటారు. చట్నీ, రసం, సాంబార్.. ముఖ్యంగా చింత పండు పులిహోర అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా వంటకాల్లో చింత పండును ఆహారం ఉపయోగిస్తారు. చింత పండుతో రుచే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింత పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇంకా చింత పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

చింత పండు తినడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. చింత పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు, విటమిన్ బి కాంప్లెక్స్ అనేవి మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా వ్యాధులతో పోరాడుతుంది.

ఇవి కూడా చదవండి

కొలెస్ట్రాల్ కు మంచిది:

చింత పండులో పోటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ వంటి పాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.

జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది:

చింత పండు జీర్ణ క్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అలాగే ప్రేగులను శుభ్ర పరుస్తుంది. దీంతో గ్యాస్, కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. మల బద్ధకం సమస్య కూడా నివారిస్తుంది. తిన్న ఆహారం నిల్వ ఉంచకుండా జీర్ణం చేస్తుంది కాబట్టి.. బరువు కూడా తగ్గొచ్చు.

గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది:

చట్టీల నుంచి పులుసులు, కూరలు వంటివి చింత పండుతో చేయడంతో చేయడం వల్ల భోజనానికి మంచి రుచి మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది చింత పండు. గుండె కు సరఫరా అయ్యే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ గుండెకు బాగా అందుతుంది. కాబట్టి రోజూ చింత పండు తీసుకున్నా లాభాలే కానీ.. నష్టాలు ఉండవు. కానీ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. దీని వల్ల పలు రకాల సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.