Get Rid of House Flies: ఎంత తరిమినా ఇంట్లో ఈగలు ముసురుకుంటున్నాయా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా ఇంట్లో ఈగలు ముసరడం అనేది కామన్ విషయం. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ఈగలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. కారణం అది మామిడి పండ్ల సీజన్ కాబట్టి. మామిడి పండ్లు తింటూంటే ఈగలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. వేసవి కాలంలోనే ఈ ఈగలు అనేవి ఎక్కువగా ఇంట్లోకి చుట్టుముడతాయి. దీంతో ఫ్లోర్ ని, ఇంట్లో చెత్తా చెదారం లేకుండా ఎంత క్లీన్ చేసినా ఇవి కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల చిరాకు వచ్చేస్తుంది. అవి మనం..

Get Rid of House Flies: ఎంత తరిమినా ఇంట్లో ఈగలు ముసురుకుంటున్నాయా.. అయితే ఇలా చేయండి!
Housefly
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2023 | 9:51 PM

సాధారణంగా ఇంట్లో ఈగలు ముసరడం అనేది కామన్ విషయం. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ఈగలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. కారణం అది మామిడి పండ్ల సీజన్ కాబట్టి. మామిడి పండ్లు తింటూంటే ఈగలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. వేసవి కాలంలోనే ఈ ఈగలు అనేవి ఎక్కువగా ఇంట్లోకి చుట్టుముడతాయి. దీంతో ఫ్లోర్ ని, ఇంట్లో చెత్తా చెదారం లేకుండా ఎంత క్లీన్ చేసినా ఇవి కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల చిరాకు వచ్చేస్తుంది. అవి మనం తినే ఆహార పదార్థాలపై వాతూంటాయి. దీని వల్ల పలు రకాల ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఈగలు.. ఒక చోట ఉన్న బ్యాక్టీరియాను మరో చోటికి తీసుకొస్తాయి. కాబట్టి ఇవి ఉన్నప్పుడు ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోని కొన్ని కిచెన్ ఐటెమ్స్ తో ఈ ఈగల్ని తరిమికొట్టవచ్చు. మరి ఈ ఈగల్ని తరిమికొట్టడానికి ఏం చేయాలో.. ఏం కావలో ఇప్పుడు చూద్దాం.

కర్పూరం:

ఈగలు ఎక్కువగా ఉన్న చోట కర్పూరం వెలిగించి పెట్టండి. దీంతో ఈగలు పరార్ అవుతాయి. కర్పూరంలో ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసనకు ఈగలు దూరంగా వెళ్తాయి.

ఇవి కూడా చదవండి

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో కూడా ఘాటు వాసన ఉంటుంది. ఈగలు ఎక్కువగా ఉన్న దాల్చిన చెక్క పొడి కానీ.. దాల్చిన చెక్కను కాని పెట్టండి. దాల్చిన చెక్క ఎయిర్ రిఫ్రెషన్ గా యూజ్ చేవచ్చు. ఈ వాసనకు ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఘాటు వాసనలు ఉంటాయన్న విషయం తెలిసిందే. దీన్ని ఆరోగ్యం కోసమే కాకుండా.. ఇలా చిట్కాగా కూడా ఉపయోగించుకోవచ్చు. కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ చిన్న బౌల్ లోకి తీసుకుని.. ఒక మూల పెట్టండి. ఈ వాసనకు ఈగలు బయటకు పారిపోతాయి.

గ్రీన్ యాపిల్ సోప్:

గ్రీన్ యాపిల్ సబ్బు కూడా ఈగలను తరిమికొట్టేందుకు బాగా ఉపయోగ పడుతుంది. చిన్న బౌల్ లో రెండు టీ స్పూన్ల గ్రీన్ యాపిల్ సోప్ లిక్విడ్ ని తీసుకోవాలి. అందులో కొద్దిగా నీటిని కలిపి.. ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉన్నచోట ఓ మూలన ఉంచాలి. ఈ సోప్ ఘాటు వాసనకు ఈగలు అటు వైపు రావు.

తులసి:

తులసి ఆకులను ఆరోగ్య పరంగా, ఆధ్యాత్మికంగానే కాకుండా ఇలా ఇంటి చిట్కాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. తులసి మొక్కతో దోమల బెడదనే కాకుండా ఈగల బెడద నుంచి కూడా తప్పించుకోవచ్చు. పుదీనా, లావెండర్ వంటి మొక్కలు కూడా ఈగలను తరిమికొడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?