Runing Benefits: డిప్రెషన్ నుంచి త్వరగా బయటకు రావాలంటే.. మందుల కంటే రన్నింగ్ బెస్ట్ ఆప్షన్!
ఎవరైన ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్ కు గురయ్యే ఉంటారు. దానికి కారణం ఏదైనా.. ఏ విషయంలోనైనా అవ్వొచ్చు. కొంత మంది అందవిహీనంగా ఉన్నామని, మరి కొంత మంది టాలెంట్ లేదని, చదవుల విషయంలో, ప్రేమ విషయంలో, ఇష్టమైన వ్యక్తి చనిపోయినప్పుడు, ఫైనాన్షియల్ విషయంలో, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఇలా సందర్భం ఏదైనా కావచ్చు. మనకు తెలియకుండానే అదే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ.. ఒత్తిడి, ఆందోళనకు గురవ్వచ్చు. ఇవే డిప్రెషన్ లోకి..
ఎవరైన ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్ కు గురయ్యే ఉంటారు. దానికి కారణం ఏదైనా.. ఏ విషయంలోనైనా అవ్వొచ్చు. కొంత మంది అందవిహీనంగా ఉన్నామని, మరి కొంత మంది టాలెంట్ లేదని, చదవుల విషయంలో, ప్రేమ విషయంలో, ఇష్టమైన వ్యక్తి చనిపోయినప్పుడు, ఫైనాన్షియల్ విషయంలో, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఇలా సందర్భం ఏదైనా కావచ్చు. మనకు తెలియకుండానే అదే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ.. ఒత్తిడి, ఆందోళనకు గురవ్వచ్చు. ఇవే డిప్రెషన్ లోకి తీసుకెళ్తాయి. చాలా మంది పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేక డిప్రెషన్ కు గురై ప్రాణాలు తీసుకుంటున్నారు.
రన్నింగ్ చేయడం వల్ల డిప్రెషన్ నుంచి దూరం కావచ్చు:
అయితే డిప్రెషన్ కు గురైన వారిని దాని నుంచి దూరం చేయాలంటే రన్నింగ్ చాలా మంచిదని.. ఇటీవల జరిగిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి రోజు రన్నింగ్ చేయడం వల్ల ఒత్తిడి నుంచి దూరం కావచ్చని తేలింది. మందుల ప్రభావంతో పోల్చితే.. రన్నింగ్ చేయడం వల్ల డిప్రెషన్ నుంచి త్వరగా కోలుకోవచ్చని ఆ పరిశోధనలు చెబుతున్నాయి.
మందుల వాడకం కంటే రన్నింగ్ బెస్ట్ ఆప్షన్:
ఆందోళన లేదా డిప్రెషన్ తో బాధ పడుతున్న 141 మందిపై ఈ అధ్యయనం జరిగింది. డిప్రెషన్ తో బాధ పడేవారు తీసుకున్న మందులపై, అలాగే డిప్రెషన్ లో ఉన్నవారు రన్నింగ్ చేయడం వల్ల మధ్య తేడాను నిపుణులు అధ్యయనం చేశారు. 141 మందిలో 45 మంది రోగులు యాంటిడి ప్రెసెంట్స్ తీసుకోవడాన్ని ఎంచుకోగా.. మరో 96 మంది మాత్రం రన్నింగ్ థెరపీని ఎంచుకున్నారు. దీనిపై 16 వారాల పాటు అధ్యయనం చేశారు నిపుణులు.
కేవలం డిప్రెషన్ మాత్రమే కాకుండా ఇతర సమస్యలకు చెక్:
అయితే మాత్రలను తీసుకున్న వారిలో కంటే రన్నింగ్ ఎంచుకున్న వారిలో తేడాలు స్పష్టంగా కనిపించాయి. మందులు తీసుకున్న వారి కంటే రన్నింగ్ చేసిన వారిలో తేడాలు ఎక్కువగా ఉన్నాయి. డిప్రెషన్ తో బాధ పడేవారు రన్నింగ్ చేయడం వలన బరువు, కొవ్వు, రక్త, అంతే కాకుండా గుండె పనితీరులో కూడా మెరుగుదల కనిపించింది.
ఒత్తిడి, నిరాశ, నిస్పృహ, ఆందోళన రుగ్మతలను తొలగించుకోవడంలో యాంటిడిప్రెసెంట్స్ కంటే వ్యాయామం మరింత ప్రభావవంతంగా ఉందని అధ్యయనాలు సూచించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి చికిత్సతో పాటు వ్యాయామం కూడా చేయాలని సూచించింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.