AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారంలాంటి ఆరోగ్యానికి బంగాళదుంప జ్యూస్..! బెనిఫిట్స్‌ తెలిస్తే..

ప్రతిరోజూ బంగాళాదుంప రసం తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య లాభాలు కలుగుతాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ జ్యూస్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్, చర్మ సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఒక మంచి పానీయం.

బంగారంలాంటి ఆరోగ్యానికి బంగాళదుంప జ్యూస్..! బెనిఫిట్స్‌ తెలిస్తే..
Potato Juice
Jyothi Gadda
|

Updated on: Dec 05, 2025 | 9:48 PM

Share

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఏదో ఒక జ్యూస్‌తో తమ రోజును మొదలుపెడుతున్నారు. క్యారెట్ జ్యూస్, బీట్‌రూట్, ఏబీసీ జ్యూస్, టమాటా జ్యూస్‌, కొత్తిమీర జ్యూస్‌ ఇలా రకరకాల జ్యూస్‌లు చేసుకుంటున్నారు. అంతేకాదు.. కొందరు గుమ్మడి కాయ, సొరకాయ, కాకరకాయ జ్యూస్‌లు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా బంగాళదుంప జ్యూస్‌ ట్రై చేశారా…? కానీ, ఇది ఆరోగ్యానికి అద్భుతం చేస్తుందని నిపుణులు చెబుతున్నార. ప్రతిరోజూ బంగాళాదుంప జ్యూస్‌ తీసుకోవటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

బంగాళాదుంపలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. కడుపులో అల్సర్లు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇప్పటికే జీర్ణ సంబంధిత వ్యాధులు, ఇతర కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా బంగాళాదుంప రసాన్ని ప్రయత్నించాలి. ఇది మంచి రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. బంగాళాదుంప రసం కళ్ళు, చర్మం, దంతాలు, నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బంగాళాదుంపతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే రాగి, మాంగనీస్, పొటాషియం, బి-విటమిన్‌లను కలిగి ఉంటాయి. బంగాళాదుంప రసంలో లభించే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు ఉదయం బంగాళాదుంప రసం తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

బంగాళాదుంప రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. మైగ్రేన్ బాధితులు బంగాళదుంప రసం తాగడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. బంగాళదుంప రసం తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది. చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. బెల్లీ బ్లోట్‌ నివారిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వర్షాల బీభత్సం షురూ.. పలు రాష్ట్రాలకు హెవీ రేన్ అలర్ట్..!
వర్షాల బీభత్సం షురూ.. పలు రాష్ట్రాలకు హెవీ రేన్ అలర్ట్..!
నా బాడీ, నా ఛాయిస్.. నేను స్విమ్ సూట్ వేస్తే ప్రాబ్లమేంటీ.. ?
నా బాడీ, నా ఛాయిస్.. నేను స్విమ్ సూట్ వేస్తే ప్రాబ్లమేంటీ.. ?
అదృష్టం అంటే ఇది.. రైలు ఎక్కిన యువకునికి ఊహించని సర్‌ప్రైజ్..!
అదృష్టం అంటే ఇది.. రైలు ఎక్కిన యువకునికి ఊహించని సర్‌ప్రైజ్..!
ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..!
ఆరేళ్ల బుడ్డోడి వినతికి ఫిదా అయిన మంత్రి.. గ్రామస్తుల ప్రశంసలు..!
రోహిత్‌నే తప్పిద్దామని స్కెచ్ వేశాడు.. కట్‌చేస్తే..
రోహిత్‌నే తప్పిద్దామని స్కెచ్ వేశాడు.. కట్‌చేస్తే..
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే
కొత్తగా కొన్న బంగారం,వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటంటే
డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు
డ్రైవర్లకు సుప్రీంకోర్టు వార్నింగ్.. ఈ తప్పు చేస్తే జేబుకు చిల్లు
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
ATM బ్లాక్ అయిందా? బ్యాంకుకు వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోండిలా!
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే చాలు.. ఉచిత శిక్షణ
భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు
భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? 99 శాతం మందికి తెలియదు