AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే గుండె గుభేల్‌

వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక మహిళ ధైర్యంగా పామును పట్టుకునే ప్రయత్నంలో భయంకరమైన కాటుకు గురైంది. తోక పట్టుకుంటే పాము తల దాడి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటన పాములు పట్టడం ఎంత ప్రమాదకరమో, శిక్షణ లేనివారు అలాంటి ప్రయత్నాలు చేయకూడదని గుర్తుచేస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, కానీ భద్రతే ముఖ్యం.

లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే గుండె గుభేల్‌
Snake Bites Woman
Jyothi Gadda
|

Updated on: Dec 05, 2025 | 4:08 PM

Share

కొన్నిసార్లు జీవితం మనకు ఊహించని అనుభవాల్ని పరిచయం చేస్తుంది. అలాంటి వాటి గురించి ఆలోచించగానే భయంతో వణికిపోయే క్షణాలను గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో అలాంటి ఒక భయంకరమైన సంఘటన. ఇక్కడ ఒక మహిళ ధైర్యం ప్రదర్శించింది. కానీ, ఆ మరుక్షణంలోనే వీధి ఆమెను ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టేసింది. ఈ సంఘటన కేవలం ఒక వీడియో కాదు.. ఇలాంటి పనులు చేస్తున్న వారెందరికో ఒక అలర్ట్‌, ఒక గుణపాఠంగా నిలుస్తంఓది. పామును పట్టుకోవడం అంటే, చిన్నపిల్లల ఆట కాదు. ఈ వీడియో దానికి అత్యంత భయంకరమైన ఉదాహరణగా నిలుస్తుంది.

ఆ వీడియో ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిందని అర్థమవుతుంది. అకస్మాత్తుగా జనం అరుపులు అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. ఒక పెద్ద పాము పొదల్లో దాక్కుని, బుసలు కొడుతూ ఉంది. స్థానికులంగా పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే చీర కట్టుకుని ఉన్న ఒక మహిళ ధైర్యంగా ముందుకు వచ్చింది. సాహసోపేతంగా పామును పట్టుకుంది. దానిని సంచిలోకి వేసే క్రమంలో ఆ పాము ఆమెకు షాకిచ్చింది. పడగ విప్పిన పాము అమాంతంగా ఆమె బుగ్గను పట్టేసింది.

ఇవి కూడా చదవండి

పాము తోకను పట్టుకున్న మహిళ దానిని సంచిలో వేస్తుండగా, ఆ పాము మెరుపు వేగంతో తిరిగి ఆమె చెంపపై దాడి చేస్తుంది. మహిళ బుగ్గపై పాము పళ్ళు బలంగా గుచ్చి పట్టేయటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్త్రీ గట్టిగా అరుస్తూ దానిని దూరంగా లాగుతుంది. కానీ, పాము పట్టు వదలలేదు. ఈ క్షణం ఒక హర్రర్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. అయితే, తోకను పట్టుకోవడం వల్ల పాము పడగ నుండి దూరంగా ఉండలేమని నిపుణులు అంటున్నారు. అలా చేయడం వల్ల దాని తల ఏక్షణంలోనేనా దాడి చేస్తుందని చెబుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇకపోతే, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన కొందరు ఆ మహిళ ధైర్యాన్ని ప్రశంసించారు. మగవారికి కూడా అంత ధైర్యం లేదంటూ చాలా మంది వ్యాఖ్యనించారు. ఇంకొందరు ఫన్నిగా మహిళ ధైర్యానికి పాము ఫిదా అయిందని, అందుకే బుగ్గపై ముద్దుపెట్టిందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు కొందరు దీనిని ప్రమాదకరమైన స్టంట్‌ అని, శిక్షణ లేకుండా పామును పట్టుకోవడం సరైన పని కాదని అంటున్నారు. అలాచేస్తే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్టే అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..