AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathing: చలికాలం స్నానం మానేస్తే ఏం జరుగుతుంది..? ఆయుష్షు రహస్యం ఇదేనట..!

చలికాలంలో స్నానం మానేయాలా? చల్లని వాతావరణం వల్ల చాలామంది స్నానం చేయలేకపోతున్నారు. స్నానం చేయకపోతే అలర్జీలు, దుర్వాసన వస్తాయని కొందరు, అతిగా చేస్తే సహజ నూనెలు పోయి చర్మం పొడిబారుతుందని నిపుణులు చెబుతున్నారు. స్నానం మానేస్తే ఆయుష్షు పెరుగుతుందనే వాదన జంతువులపై చేసిన పరిశోధనలే కానీ, మానవులకు వర్తించదని స్పష్టం చేశారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం.

Bathing: చలికాలం స్నానం మానేస్తే ఏం జరుగుతుంది..? ఆయుష్షు రహస్యం ఇదేనట..!
Bathing
Jyothi Gadda
|

Updated on: Dec 02, 2025 | 9:57 PM

Share

చలికాలం స్నానం చేయడానికి చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. చల్లటి గాలులు, శీతల వాతావరణం కారణంగా నీళ్లు ముట్టుకోవాలంటేనే వణుకు పుడుతుంది. అందుకే స్నానం చేయాలంటే చాలా మందికి భయం. వేడి నీటితో స్నానం చేసినా చలి ఎక్కువ అవుతుంది. అయితే, స్నానం చేయకపోతే ఏం జరుగుతుంది..? చెమట శరీరంపై అలాగే పేరుకుంటుంది. ఇది రానురాను అలర్జీలకు దారితీస్తుంది. శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అందుకే తప్పనిసరిగా స్నానం చేయడమే మంచిది.

అయితే, ప్రత్యేకంగా శరీరాన్ని తరచూ కడుగుతూ స్నానం చేయడం వల్ల బయట నుంచి వచ్చే జీవాణువులకు నిరోధకంగా పనిచేసే సహజ నూనె తగ్గిపోతుందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. పైగా చలికాలంలో చర్మం మరింత పొడిబారే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అయితే.. చలికాలంలో స్నానం మానేస్తే ఆయుష్షు పెరుగుతుందని చెబుతూ ఓ పరిశోధన వార్త గతంలో సోషల్ మీడియాలో వైరల్‌ మారింది. దీని ప్రకారం శరీర ఉష్ణోగ్రత తగ్గితే జీవక్రియ నెమ్మదిస్తుందని, ఆక్సీకరణ ఒత్తిడి తక్కువ అవుతుందని చెబుతున్నారు. దీని వల్ల వృద్ధాప్యం ఆలస్యం అవుతుందని కొన్ని ప్రయోగాలు సూచించాయి.

ఇవి కూడా చదవండి

కానీ.. ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు.. ఈ పరిశోధనలన్నీ జంతువులపై చేసిన అధ్యయనలు మాత్రమే అంటున్నారు. మానవులపై ఇదే ప్రభావం ఉంటుందని ఇంకా ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అయితే అతిగా స్నానం చేయడం వల్ల చర్మంలోని సూక్ష్మజీవులు దెబ్బతింటాయని సహజ రక్షణ, కానీ పూర్తిగా స్నానం చేయకపోవడం పరిశుభ్రత సమస్యలు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని తెలిపారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.