AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White House Security: వైట్ హౌస్ రహస్యాలు.. క్షిపణులు, అణు బాంబులు కూడా ఏమీ చేయలేవు..!

శ్వేత సౌధం, లేదా వైట్ హౌస్, అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఈ అద్భుత భవనం 18 ఎకరాల్లో విస్తరించి, సకల సౌకర్యాలతో ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఈ నివాసంలో 132 గదులు, రహస్య సొరంగాలు, బంకర్లు ఉన్నాయి. దీని అజేయ భద్రత, చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తుంది.

White House Security: వైట్ హౌస్ రహస్యాలు.. క్షిపణులు, అణు బాంబులు కూడా ఏమీ చేయలేవు..!
White House
Jyothi Gadda
|

Updated on: Dec 02, 2025 | 5:46 PM

Share

శ్వేత సౌదం.. దీనినే వైట్‌ హౌస్‌ అని కూడా అంటారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు కుటుంబసమేతంగా నివాసముండే అధికారిక భవనమే వైట్ హౌస్. సకల సౌకర్యాలతో ఇంద్రభవనాన్ని తలపించేలా వుంటుంది వైట్ హౌస్. ఇది అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి లోకి 1600 పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో వుంది. ఇది 18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన విశాలమైన రాజభవనం. అంతేకాదు..ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నివాసం ఇది. 1800 నుండి అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసంగా ఉన్న ఈ వైట్‌హౌస్‌ భవనం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

వైట్‌ హౌస్‌ అనేది ఆరు అంతస్తుల భవనం. బేస్మెంట్లో రెండు అంతస్తులు ఉన్నాయి. దీనిని ప్రెసిడెంట్ హౌస్, ప్రెసిడెంట్ ప్యాలెస్, ఎగ్జిక్యూటివ్ మాన్షన్ అని కూడా పిలుస్తారు. దీనిని 1901లో అప్పటి అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ వైట్ హౌస్ గా పేరు మార్చారు. దీనిలో 132 గదులు, 32 బాత్రూమ్‌లు, 412 తలుపులు, 8 మెట్ల మార్గాలు, 3 లిఫ్ట్‌లు, 147 కిటికీలు ఉన్నాయి. ఈ ఇంటి భద్రతను నిరంతరం అతి జాగ్రత్తగా నిర్వహిస్తారు. బుల్లెట్‌లు, క్షిపణులు వంటివి కూడా దీనిని ధ్వంసం చేయలేవు. అంతేకాదు.. అణు దాడి జరిగినప్పుడు కూడా దానిని రక్షించడానికి బంకర్‌లను నిర్మించారు.

వైట్ హౌస్ 8 ఎకరాలలో విస్తరించి ఉంది. 55,000 చదరపు అడుగుల అంతస్తు స్థలం ఉంది. మిగిలిన ప్రాంతంలో తోటలు, స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ కోర్టులు, జాగింగ్ ట్రాక్‌లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి గదిని ఎప్పుడూ అందమైన పూలతో అలంకరించి ఉంచుతారు.. ఒక ప్రైవేట్ సినిమా స్క్రీనింగ్ థియేటర్, బౌలింగ్ అల్లే కూడా ఉన్నాయి. ఇది నిజంగా విలాసవంతమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇందులో స్టేట్ డైనింగ్ రూమ్, ఓవల్ ఆఫీస్, మ్యాప్ రూమ్ వంటి అనేక ప్రత్యేక గదులు ఉన్నాయి. ఇందులో రెండు ఫార్మల్ గార్డెన్‌లు, కిచెన్ గార్డెన్, పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్రత్యేక పిల్లల గార్డెన్ కూడా ఉన్నాయి. వైట్ హౌస్ జిమ్‌తో సహా అన్ని ఆధునిక సౌకర్యాలతో అమర్చబడి ఉంది.

వైట్ హౌస్‌కు రెండు సొరంగాలు, ఒక రహస్య బంకర్ నిర్మించబడ్డాయని కూడా చెబుతారు. ఒక సొరంగం ట్రెజరీ భవనానికి దారితీస్తుంది. మరొకటి సౌత్ లాన్ వైపు వెళుతుంది. ఇది మెరైన్ వన్ హెలికాప్టర్‌కు ల్యాండింగ్‌ను అందిస్తుంది. వైట్ హౌస్‌లో సిట్యువేషన్ రూమ్ అని పిలువబడే బంకర్ కూడా ఉంది. ఇది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది. ఈ బంకర్‌లు బలమైన ఇనుముతో తయారు చేయబడి ఉన్నాయని, అవి ఏలాంటి దాడినైనా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయని చెబుతారు.

వైట్ హౌస్ భద్రత అజేయమైనది. స్నిపర్లు, SWAT బృందాలు ఎల్లప్పుడూ పైకప్పు, చుట్టుపక్కల భవనాలపై మోహరించి ఉంటాయి. హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు, డాగ్ స్క్వాడ్‌లు వైట్ హౌస్‌లో గస్తీ తిరుగుతాయి.

వైట్ హౌస్ క్షిపణి నిరోధక, డ్రోన్ నిరోధక క్షిపణి వ్యవస్థలతో పాటు ఇంటర్‌సెప్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ జెట్ విమానాల ద్వారా రక్షించబడుతుంది. వైట్ హౌస్ చుట్టూ 24 కిలోమీటర్ల నో-ఫ్లై జోన్ ఉంది. అధ్యక్షుడికి 1,300 మంది సిబ్బందిని నియమించే US సీక్రెట్ సర్వీస్ రక్షణ కల్పిస్తుంది.

వైట్ హౌస్ లో బ్లెయిర్ హౌస్ అనే అతిథి గృహం కూడా ఉంది. అధ్యక్షుడి అధికారిక అతిథులు మాత్రమే ఇక్కడ బస చేయగలరు. బ్లెయిర్ హౌస్ లో 119 కెమెరాలు అమర్చబడి ఉంటాయి. విదేశీ అతిథులు బ్లెయిర్ హౌస్ లో బస చేసినప్పుడు, ఆ దేశ జెండా ఇంటిపై ఎగురవేయబడుతుంది.

‘వైట్ హౌస్’ అనే పేరు ఎలా వచ్చింది?:

నిజానికి, 1798లో ఆ భవనాన్ని చలి, పగుళ్ల నుండి రక్షించడానికి సున్నంతో తెల్లగా చేశారు. 1814లో బ్రిటిష్ దళాలు వైట్ హౌస్‌ను తగలబెట్టినప్పుడు, దాని గోడలపై మంటలు, పొగ మరకలను కనిపించకుండా ఉంచడానికి దానికి తెల్లగా పెయింట్ చేశారని కూడా చెబుతారు. అందుకే దీనికి వైట్ హౌస్ అని పేరు పెట్టారట.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..