AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35ఏళ్లుగా మహిళ ముక్కులో నక్కిన వింత వస్తువు..! చివరకు CT స్కాన్‌లో తెలిసింది ఏంటంటే..

సోషల్ మీడియా అంటేనే వింతలు, విశేషాలు, షాకింగ్‌ ఘటనలు, వార్తలకు అడ్డా.. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి వార్త వెలుగులోకి వస్తుందో ఏవరూ ఊహించలేరు కూడా. ప్రతిరోజు వందలు, వేలలో వైరల్‌ న్యూస్‌ కనిపిస్తాయి. ఇది కూడా అలాంటి ఒక షాకింగ్‌ న్యూసే. ఇక్కడ ఒక మహిళ ముక్కులో 35 ఏళ్ల క్రితం ఇరుక్కుపోయిన ఒక వింత వస్తువును ఇటీవల బయటకు తీశారు వైద్యులు. అది చూసి బాధిత మహిళ సైతం ఆశ్చర్యపోయింది. ఇంతకీ అదేంటో ఇక్కడ చూద్దాం..

35ఏళ్లుగా మహిళ ముక్కులో నక్కిన వింత వస్తువు..! చివరకు CT స్కాన్‌లో తెలిసింది ఏంటంటే..
35 Year Mystery Nose
Jyothi Gadda
|

Updated on: Dec 01, 2025 | 3:40 PM

Share

అర్జెంటీనాకు చెందిన కాండెలా రెబౌడ్ అనే మహిళ ఇద్దరు పిల్లలకు తల్లి. కానీ, ఆమె ఎప్పుడూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండేది. చిన్నప్పటి నుంచి ఆమెకు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో అవస్థ పడుతూ ఉండేది. ఆమె ముక్కులో ఒక వైపు ఎప్పుడూ సగం మూసుకుపోయినట్లు అనిపించిదేట. కానీ ఈ సమస్యకు కారణం ఏంటో తనకు కూడా తెలియదు. చివరకు ఆమెకు సమస్య మరింత తీవ్రంగా మారటంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. కాండెలాను పరీక్షించిన వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించారు. దాదాపు గంటసేపు ప్రయత్నించిన తర్వాత ఆమె ముక్కులోంచి బయటకు వచ్చినది చూసి డాక్టర్లు సైతం షాక్‌ అయ్యారు.

కాండెలాకు చికిత్స చేసిన వైద్యులు ఆమె ముక్కులోంచి మడతపెట్టి ఉన్నటేపు ముక్కను బయటకు తీశారు. అది చూసిన బాధితురాలు కూడా ఆశ్చర్యపోయింది. అది తన ముక్కులోకి ఎలా వచ్చిందో కాండెలాకు గుర్తులేదు. ఆమె కుటుంబ సభ్యులతో చర్చించగా, 1990లో పుట్టింది కాండెలా. నవజాత శిశువుగా ఉన్నప్పుడు, ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని తల్లిదండ్రులు చెప్పారు. ఆ సమయంలో డాక్టర్లు ఆమె ముక్కులో ఒక గొట్టాన్ని చొప్పించారని చెప్పారు. బహుశా అనుకోకుండా ఒక టేప్ ముక్క లోపల ఉండిపోయి ఉంటుందని, అది 35 సంవత్సరాలుగా అక్కడే ఉండిపోయి ఉంటుందని భావించారు.

ఈ సందర్భంగా కాండేలా నవ్వుతూ, నా జీవితమంతా నా నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి ఆ టేప్ కారణం అని చెప్పింది. ఆమెకు శారీరక శ్రమ, నిద్ర, జాగింగ్ వంటి ప్రతి పనిలోనూ ఇబ్బంది ఉండేది. కానీ ఆమె దానిని పట్టించుకోలేదు. అది ఒక అలవాటు అనుకుంది. అయితే, ఒక సంవత్సరం క్రితం కాండెలాకు సైనసైటిస్ కనిపించింది. తరువాత నొప్పిగా ఉండటంతో వైద్యులను సంప్రదించాల్సి వచ్చింది. అన్ని టెస్టులు, CT స్కాన్ చేసిన వైద్యులు ఆ రిపోర్ట్స్‌లో ఒక వింతైన దృశ్యాన్ని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

చివరకు కాండెలా ముక్కులోంచి టేప్ బయటపడటంతో కాండెలా నిజంగానే ఊపిరి పీల్చుకుంటున్నారు. 35 సంవత్సరాల తర్వాత నా ముక్కు తెరిచి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను బాగా ఊపిరి పీల్చుకుంటున్నాను అంటూ సంతోషం వ్యక్తం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..