నదిలో ఐఫోన్‌ల వరద.. గ్రామస్తులను వరించిన అదృష్టం..! షాకింగ్ వీడియో చూశారంటే..
నదిలో లంగరు వేసిన కార్గో షిప్ కంటైనర్ నుండి వేల ఐఫోన్‌లు బయటపడి నీటిలో పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. గ్రామస్తులు పడవలతో వచ్చి ఐఫోన్ బాక్సులను సేకరిస్తున్న దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో AI-జనరేటెడ్ అని కొందరు భావిస్తున్నప్పటికీ, దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఐఫోన్‌ల కోసం ఎగబడిన ప్రజల సంతోషం ఈ వీడియోలో కనిపిస్తుంది.

తెల్లవారుజామున నది ఒడ్డున కూర్చున్నట్లు ఊహించుకోండి. గాలి కొద్దిగా తేమగా ఉంటుంది. నీరు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అకస్మాత్తుగా దూరంగా ఎక్కడి నుంచో ఒక శబ్దం వస్తుంది. ప్రజలు అరుస్తున్నారు. కొన్ని పడవలు నీటిలో వేగంగా ప్రయాణిస్తున్నాయి. దగ్గరకు వచ్చేసరికి మీ కళ్ళ ముందు ఒక దృశ్యం కనిపిస్తుంది. అది ఎవరినైనా షాక్ అయ్యేలా చేస్తుంది. నది మధ్యలో ఒక ఓడ లంగరు వేయబడి ఉంది. దాని కంటైనర్లలో ఒకదాని తలుపు కాస్త తెరుచుకుని ఉంది..లోపల నుండి జలపాతంలా ఐఫోన్ సీల్డ్స్ బాక్స్‌లు ప్రవహిస్తున్నాయి. అవును, నెలల తరబడి EMIలు చెల్లించే అదే ఐఫోన్ కళ్లముందే నదిలో పడి కొట్టుకుపోతున్నాయి. ఇదంతా ఏదో ఊహించి చెబుతున్నది కాదు..ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో కనిపించిన దృశ్యం. పూర్తి వివరల్లోకి వెళితే…
నదిలో లంగరు వేసిన కార్గో షిప్‌లోని కంటైనర్ అకస్మాత్తుగా తెరుచుకోవడం, ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా ఐఫోన్‌లు ఉన్న పెట్టెలు నీటిలో పడటం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యం సమీపంలోని గ్రామస్తులలో భయాందోళనలకు గురిచేసింది. దీన్ని చూసిన ప్రజలు తమ పడవలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐఫోన్ బాక్స్‌లతో నిండిన కంటైనర్‌ను గ్రామస్తులు సంకోచిస్తూ వాటిని తీసుకొని తమ పడవల్లోకి ఎక్కించుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నదిలో పడిపోతున్న బాక్స్‌లను కొంతమంది వంగి పట్టుకుంటున్నారు. మరికొందరు వాటిని నేరుగా కంటైనర్ నుండి బయటకు తీసి కిందకు తమ పడవలో వేసుకుంటున్నారు. ఈ సీన్ చూస్తుంటే.. నదిలో అకస్మాత్తుగా ఐఫోన్ల వర్షం కురిసినట్టుగా కనిపించింది.
ఈ వీడియోలో చాలా మంది హ్యాపీగా నవ్వుతూ ఐఫోన్ బాక్స్‌లను తీసుకోవటం కనిపిస్తోంది. కొందరు ఒకేసారి చాలా బాక్సులను పట్టుకుంటున్నారు. కొన్నింటిని పట్టుకోలేకపోతున్నారు. oye_sanki_1 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చాలామంది దీనిని ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
అయితే, ఈ వీడియో AI- జనరేటెడ్ అని చెప్పుకుంటున్నారు. కానీ, ఈ వీడియో మాత్రం ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి భిన్నమైన కామెంట్లు వచ్చాయి. ఒకరు దీనిపై స్పందిస్తూ..బ్రదర్ దయచేసి నాకు కనీసం ఒకటైన ఇవ్వండి అని రాశారు. మరొకరు వావ్, మీరు బిలియనీర్ అయ్యారు అని రాశారు. మరొక దీనిపై స్పందిస్తూ మీకు ఎంత అదృష్టం ఉంది? అని రాశారు. వీడియో AI లాగా ఉంది అని కూడా చాలా మంది రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




