ఈ విత్తనాలు వేస్ట్ అనుకుంటే బోలెడంతా లాస్ మీకే.. లాభాలు తెలిస్తే ఒక్క గింజ కూడా వదిలిపెట్టరు..
పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే, కొన్ని రకాల పండ్ల విత్తనాలు కూడా బోలెడన్నీ ప్రయోజనాలు కలిగి ఉంటాయని మీకు తెలుసా..? అందులో పుచ్చకాయ గింజలు కూడా ఒకటి. ఈ పుచ్చకాయ గింజలలో ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. కాబట్టి పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 29, 2025 | 1:10 PM

పుచ్చకాయ గింజల్లో ఉండే మెగ్నీషియం, మంచి కొవ్వులు ఒమేగా-3, ఒమేగా-6 గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని యాంటీ-ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.

పుచ్చకాయ గింజల్లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ గింజలలో ఉండే మెగ్నీషియం, ప్రోటీన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

పుచ్చకాయ గింజలు శక్తిని పెంచుతాయి. ఇవి రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే జింక్, మెగ్నీషియం శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. బలమైన రోగనిరోధక శక్తి శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

పుచ్చకాయ గింజల్లో కేలరీలు చాలా తక్కువ. బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది. మరోవైపు, శరీరానికి అవసరమైన రాగి, జింక్, పొటాషియం, మెగ్నీషియం , ఐరన్ వంటి ఖనిజాలు , పోషకాలు ఉన్నాయి. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పుచ్చకాయ గింజల్లోఅధిక స్థాయి మెగ్నీషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడబడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, జింక్, ఫోలేట్, పొటాషియం, రాగి సహజ మల్టీవిటమిన్‌గా పనిచేస్తాయి.




